Tour Package: గురుపౌర్ణమికి అరుణాచలం వెళ్తారా? టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

Arunachalam Giri Pradakshina: గురుపౌర్ణమి రోజున తమిళనాడులోని అరుణాచలం గిరిప్రదక్షిణ చేయాలనుకొనే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Updated : 25 Jun 2023 19:36 IST

హైదరాబాద్‌: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ(Arunachalam Giri Pradakshina) చేయాలనుకునే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదక్షిణకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని TSRTC నిర్ణయించింది. ఈ మేరకు ప్యాకేజీ పూర్తి వివరాలను టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

టూర్‌ ప్యాకేజీ వివరాలివే..

  • అరుణాచల గిరి ప్రదర్శనను TSRTC ఓ టూర్‌ ప్యాకేజీలా అందిస్తోంది. సర్వీస్‌ నంబర్‌ 98889 బస్సు జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది. 
  • ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకంలో విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. 
  • గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక జులై 3న మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. అక్కడ దర్శనానంతరం మరుసటి రోజు జులై 4న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటుంది. 
  • ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. 
  • ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌ నగర్ బస్టాండ్‌తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. 
  • ఈ టూర్ ప్యాకేజీకి సంబందించి ప్రయాణికుల బస, ఇతర పూర్తి వివరాల కోసం 99592 26257, 99592 24911 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని