Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Feb 2024 17:27 IST

1. సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు రూ.78వేల వరకు సబ్సిడీ

సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అమలు దిశగా మరో ముందడుగు పడింది. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna)’కు  కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘కేఆర్‌ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా?’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) విధివిధానాలపై ఆయన వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని భారాసకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పందించారు. ‘‘మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం’’ అని ప్రతి సవాల్‌ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సైకిల్‌కి ఎదురొస్తే.. తొక్కుకుంటూ ముందుకెళ్లడమే..!: నారా భువనేశ్వరి

సైకిల్‌కి ఎదురొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి ఎన్నికల్లో తెదేపా (TDP) జెండా ఎగురవేద్దామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తెదేపాలోనే కొనసాగుతా: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. విజయవాడ తెదేపా లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ కేశినేని చిన్ని ఆయన్ను లోకేశ్‌ వద్దకు తీసుకెళ్లారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్‌ఖాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగడతానని.. పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం భారాస అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. దీపిక లాంటి ఆడపిల్ల కావాలి: రణ్‌వీర్‌ సింగ్‌

బాలీవుడ్‌ కపుల్‌ దీపికా(Deepika Padukone)-రణ్‌వీర్‌ (Ranveer Singh) తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌ తనకు దీపిక లాంటి ఆడపిల్ల కావాలని ఆశపడుతున్నట్లు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు (Naga Babu) తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్‌ విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్‌ లిషిత పరారీలో ఉండగా.. 3 రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆమె ఇంట్లో లేదని లిషిత సోదరి కుషిత పీఎస్‌కు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చారు. విచారణకు లిషిత కచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. నిజం తెలియాలనే ఇప్పుడు బయటకు వెల్లడించా: హనుమ విహారి

రంజీ ట్రోఫీ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిన భారత క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు