Updated : 05 Jul 2021 09:14 IST

Top Ten News @ 9 AM

1. AP News: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఖాయమే!

విశాఖలో దక్షిణకోస్తా (సౌత్‌కోస్టు) జోన్‌, ఒడిశాలోని రాయగడ డివిజన్ల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు అంశాలపై రైల్వేమంత్రిత్వ శాఖకు పంపిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లపై నిర్ణయం ఇప్పటికీ పెండింగులోనే ఉంది. ఏర్పాటుకు సమయం పడుతుందని రైల్వేమంత్రి గతంలో ప్రకటించారు. అయితే వీటి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: కొలువుల ఆశలపైనీళ్లు

2. TS News: వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు

పాలనే సాధ్యం కాదన్న చోట సంస్కరణలు పుట్టుకొచ్చాయని. కరవును చూసి కన్నీళ్లుపెట్టుకున్న కళ్లకే పుష్కలంగా నీళ్లు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారిలో అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. ఏవిధంగా అయితే రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్నామో.. ఇక మీద చేనేత కార్మికులకూ అలాగే రూ.5 లక్షల చేనేత బీమా ఇవ్వబోతున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Corona: వాటిని బట్టే కొవిడ్‌ తీవ్రత అంచనా

కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నప్పుడు నిరంతరం మనసులో ఆందోళన తొలుస్తూనే ఉంటుంది. జబ్బు తగ్గుతోందా, ముదురుతోందా.. తెలుసుకోవటమెలా? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఇలాంటి సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే శ్వాస త్వరత్వరగా తీసుకోవటం, ఆక్సిజన్‌ 91 శాతం కన్నా తక్కువకు పడిపోవటం అనే రెండు అంశాలు చాలా కీలకమని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి ప్రాణాపాయ స్థితిని అంచనా వేయటానికి తోడ్పడే సూచికలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిర్లక్ష్యం వెంటే నీడలా..!

4. ఒకే ఒక్క మిథాలి

ఆమె క్రికెట్లోకి అడుగు పెట్టే సమయానికి ఇప్పుడు భారత జట్టులో స్టార్లుగా ఉన్న షెఫాలీవర్మ, జెమిమా రోడ్రిగ్స్‌ లాంటి వాళ్లు పుట్టనే లేదు.. ఆమె రికార్డులు కొట్టే సమయానికి స్మృతి మంధాన లాంటి వాళ్లు బ్యాట్‌ పట్టనే లేదు. 22 ఏళ్లు.. ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు! ఇప్పటికీ యువ బ్యాటర్లతో పోటీపడుతూ పరుగులు! తాజాగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈ  హైదరాబాదీ అమ్మాయి మరో ఘనత సొంతం చేసుకుంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సాగిన 22 ఏళ్ల ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విశాఖ ‘ఉక్కు’ ప్రైవేటీకరణకు కీలక అడుగులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్‌ అడ్వయిజర్‌), న్యాయ సలహాదారుల (లీగల్‌ అడ్వయిజర్‌) నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అత్యంత క్లిష్టమైన ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వీళ్లింతే.. మారరు

6. Drones: డ్రోన్లు కూల్చగలం

సరిహద్దుల్లో డ్రోన్ల దాడులు భారత్‌కు సవాల్‌గా మారాయి. జమ్మూలోని ఐఏఎఫ్‌ స్థావరంపై జూన్‌ 27న జరిగిన డ్రోన్‌ దాడి ఉలికిపాటుకు గురిచేసింది. ఆ తర్వాతా డ్రోన్లు మన భూభాగంలో చక్కర్లు కొట్టాయి. వైమానిక కేంద్రాలు, సైనిక శిబిరాలు లక్ష్యంగా శత్రువులు ఈ తరహా దాడులకు యత్నిస్తుండటం భారత్‌ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కౌంటర్‌-డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానానికి డ్రోన్లను వేగంగా గుర్తించి నాశనం చేసే సామర్థ్యం ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు

నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం సింగన్‌గావ్‌లో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ముగ్గురు బాలిక మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులను సునీత (16), వైశాలి (14), అంజలి (14)గా గుర్తించారు. వీరిలో వైశాలి, అంజలి అక్కా చెల్లెళ్లు. బాలికలు ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డారా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Crime: ఫోన్‌లో మాట్లాడుతున్నారని.. కర్రలతో చితకబాదారు

8. RMIT: గాయాలకు స్మార్ట్‌గా ఆట‘కట్టు’

ఒంటిపై ఏర్పడే గాయాలను నయం చేయడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ కట్టును అభివృద్ధి చేశారు. గాయం సరిగా నయం కాకుంటే.. ఇందులోని సెన్సర్లు రోగిని అప్రమత్తం చేస్తాయి. ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. గాయానికి కట్టు కట్టాక.. అది మానుతోందో లేదో తెలుసుకోవాలంటే కట్టు విప్పి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో కట్టు విప్పకుండానే గాయం ఎంత మేర తగ్గిందో తెలుసుకోవడానికి స్మార్ట్‌ కట్టును ఆర్‌ఎంఐటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రతి రూపాయీ లెక్కే!

డబ్బు పొదుపు చేయాలని మనసులో ఉన్నా... ఎలాగో తెలియదు కొందరికి. దాంతో అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఆ తర్వాత బాధపడతారు. మీరూ అలానే చేస్తుంటే...ఇది చదవండి. పొదుపు గురించి తెలియకపోతే... ఎంత సంపాదించినా నిరుపయోగమే! ఖర్చుపెట్టేప్పుడు చిన్న మొత్తమే అనిపించొచ్చు కానీ నెల తిరిగేసరికి అమ్మో ఇంత ఖర్చు చేసేశామా అనిపిస్తుంది. అందుకే చిల్లర వాడుకున్నా సరే.. లెక్క రాయండి. అప్పుడు వృథాని గుర్తించి అడ్డుకట్ట వేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిమ్మతో రక్తహీనతకు చెక్‌

10. సరికొత్త కాంబినేషన్లతో స్వాగతిస్తోంది డిగ్రీ!

ఇంటర్మీడియట్‌ తర్వాత వృత్తివిద్యల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతున్నప్పటికీ మరో పక్క సంప్రదాయ డిగ్రీ కోర్సులూ పెద్ద ఎత్తునే ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటి కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా ఈ డిగ్రీ కోర్సుల్లో మార్పులు ప్రవేశపెడుతుండటం దీనికో కారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ కళాశాలల ప్రవేశాల పరిస్థితి ఏమిటి? విద్యార్థులు గమనించదగ్గ అంశాలేమిటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని