Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Nov 2023 09:04 IST

1. తెలంగాణ ఎన్నికలు.. అభ్యర్థులు వీళ్లే..

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. అధికారులు 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాస; 118 స్థానాల్లో కాంగ్రెస్‌, పొత్తులో ఒక చోట సీపీఐ; 111 చోట్ల భాజపా, పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన; 19 నియోజకవర్గాల్లో సీపీఎం; 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. అభ్యర్థుల పేర్లు.. పార్టీ వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏ పోలింగ్‌ బూత్‌లో మీ ఓటు? ఇలా తెలుసుకోండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశాయి. అడ్రస్‌ మారడం వల్లో, ఇతర కారణాల వల్లో కొందరికి పోలింగ్‌ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్‌ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి.  వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: సెలబ్రిటీల పిలుపు

ఓటు హక్కు.. (Telangana Assembly Elections) ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఓటును సద్వినియోగం చేసుకుంటే దేశ భవిష్యత్తే కాదు.. ప్రజల తలరాత మారుతుంది. పోలింగ్ను ప్రజాస్వామ్య పండుగగా భావించి తరలి వెళ్లి ఓటువేయాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మంచి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కోవాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఓటు వేయకుంటే శిక్ష, జరిమానా..

ఎన్నికల్లో ఓటు వేయనివారికి కొన్ని దేశాల్లో జరిమానా విధిస్తారు. మరికొన్ని దేశాల్లో నేరస్థులుగా పరిగణించి శిక్షలు వేస్తారు. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఓటు వేయని వారికి ఆ దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్ల జరిమానా విధిస్తారు. దాన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లించకపోతే 200 డాలర్ల వరకు అదనపు జరిమానా కట్టాల్సి ఉంటుంది. బెల్జియంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోల వరకు, రెండోసారి ఓటు వేయనివారికి 200 యూరోల వరకు జరిమానా విధిస్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.  ఆ తొమ్మిదింట్లో సంతృప్తి చెందకపోతే.. రీ పోలింగ్‌..

ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది అంశాలు కీలకం. వీటిలో ఎన్నికల పరిశీలకుడు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహణ తీరులో సంతృప్తి చెందకపోతే ఆ పోలింగ్‌ కేంద్రాలలో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేయొచ్చు. పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఓటరు వివరాలు, గుర్తింపు కార్డు, తదితర అంశాలను పోలింగ్‌ కేంద్రంలో నమోదు చేయనున్నారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ఏదైన ఫిర్యాదులు వెళ్లినట్లయితే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పరిశీలకుడు సమీక్ష చేస్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్‌ క్యూ రూట్’ పోర్టల్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2023) సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్‌ వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ వినూత్న చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయన ‘పోల్‌ క్యూ రూట్‌’ అనే ప్రత్యేక పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.ఒకసారి అమ్ముడుపోతే.. ఐదేళ్లు కష్టాలే!

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా సెల్‌ఫోన్లకు వందల పోస్టులు వచ్చిపడుతూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ పార్టీకే ఎందుకు ఓటెయ్యాలో, ప్రత్యర్థి పార్టీకి ఎందుకు వేయకూడదో వివరిస్తూ, తమ హామీలను వెల్లడిస్తూ... రీల్స్‌, మీమ్స్‌, వీడియోలు, ఫొటోలు, ప్రకటనల రూపంలో పోస్టులను వెల్లువెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్లను చైతన్యపరుస్తూ కొందరు యువకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లు స్ఫూర్తిదాయక అంశాలను పోస్టు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని, అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే తాయిలాలు తీసుకోవద్దని, ఒకసారి అమ్ముడుపోతే అయిదేళ్లు కష్టాలు అనుభవించాల్సి వస్తుందని అప్రమత్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణలో పోలింగ్‌.. మోదీ పిలుపు

 ‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను’’ అని మోదీ కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. 81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు

వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం రాత్రి దిల్లీలో జరిగిన కేబినెట్‌ భేటీ నిర్ణయాలను బుధవారం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మీడియాకు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు.. ఓటు వేయకుండానే వెనక్కి..

 తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, సెల్‌ఫోన్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించబోరని తెలియక చాలా చోట్ల ఓటర్లు  మొబైల్స్‌ తీసుకెళ్తున్నారు. క్యూలైన్లలో నిల్చుని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లాక.. అక్కడ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని