icon icon icon
icon icon icon

Re Polling: ఆ తొమ్మిదింట్లో సంతృప్తి చెందకపోతే.. రీ పోలింగ్‌..

ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది అంశాలు కీలకం. వీటిలో ఎన్నికల పరిశీలకుడు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహణ తీరులో సంతృప్తి చెందకపోతే ఆ పోలింగ్‌ కేంద్రాలలో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేయొచ్చు.

Updated : 30 Nov 2023 07:55 IST

ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది అంశాలు కీలకం. వీటిలో ఎన్నికల పరిశీలకుడు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహణ తీరులో సంతృప్తి చెందకపోతే ఆ పోలింగ్‌ కేంద్రాలలో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేయొచ్చు. పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఓటరు వివరాలు, గుర్తింపు కార్డు, తదితర అంశాలను పోలింగ్‌ కేంద్రంలో నమోదు చేయనున్నారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ఏదైన ఫిర్యాదులు వెళ్లినట్లయితే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పరిశీలకుడు సమీక్ష చేస్తారు. అందులో ఆ అధికారికి ఎలాంటి సందేహం కలిగినా, ఫిర్యాదు వచ్చిన పోలింగ్‌ కేంద్రంలోనే రీ పోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తారు.

అందుకు సంబంధించిన అర్హతలు

తిరిగి పోలింగ్‌ నిర్వహించేందుకు కావాల్సిన పత్రాలలో ముఖ్యంగా ఫాం 17-ఏ కావాల్సి ఉంది. దీని ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు లేదా వారి ప్రతినిధులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ దరఖాస్తును పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారికి అందించినట్లయితే వారు ఎన్నికల పరిశీలకులకు సమర్పిస్తారు. అభ్యర్థులు చేసిన ఫిర్యాదులను పరిశీలించనున్నారు. ప్రధానంగా తొమ్మిది వరకు ఫిర్యాదులను తీసుకుని తదుపరి ప్రక్రియను నిర్వహించనున్నారు.

తొమ్మిది అంశాలు ఇలా...

1)  అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియలో అబ్జర్వర్‌, డీఈవో లేదా ఆర్వోల ద్వారా ఏదైనా రిగ్గింగ్‌, ఏవైనా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందితే పరిశీలిస్తారు.

2)  ఏదైనా ముఖ్యమైన సంఘటన ఈవీఎం, వీవీప్యాÆట్లకు సంబంధించిన, ఇతరత్రా జరిగిన పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ సమయంలో పరిశీలకుడు, డీఈవో లేదా ఆర్వోకి నివేదించినప్పుడు.

3)  పోలింగ్‌ కేంద్రంలో ఏ పోలింగ్‌ ఏజెంట్ లేనప్పుడు, ఒకే ఒక అభ్యర్థి ఏజెంట్ సమక్షంలో పోలింగ్‌ జరిగిన సందర్భాల్లో.

4) పోలింగ్‌ స్టేషన్‌లో ఈపీఐసీ(కమిషన్‌ పేర్కొన్న ప్రత్యామ్నాయ పత్రాలు) కాకుండా ఇతర పత్రాలను ఉపయోగించి ఓటు వేసిన ఓటర్ల సంఖ్య ఆ పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్లలో 25శాతం మించిపోయినప్పుడు.

5) ఏఎస్డీగా గుర్తించిన 10శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు హాజరై ఓటు వేసిన పోలింగ్‌ కేంద్రాలలో.

6) పోలింగ్‌ కేంద్రాలలో ఆ ఏసీ సగటు పోలింగ్‌ శాతం కంటే పోలింగ్‌ 15శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు.

7) పోలింగ్‌ స్టేషన్లలో కనీసం ఐదు టెండర్‌ వేసిన ఓటు,్ల సవాలు చేసిన ఓట్లు నివేదించిన సందర్భాల్లో.

8) పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల రిజిస్టర్‌ (ఫారం-17ఏ) 10శాతం, అంతకంటే ఎక్కువ రిమార్కులు నిర్దేశించిన కాలమ్స్‌ ఖాళీగా ఉన్నప్పటికీ ఈపీˆఐసీˆ ప్రత్యామ్నాయ  పత్రాన్ని ఉపయోగించినప్పుడు.

9) మైక్రో అబ్జర్వర్‌ ప్రతికూల నివేదికను సమర్పించిన పోలింగ్‌ కేంద్రాలలో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img