Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Dec 2023 09:13 IST

1. అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం

రాష్ట్ర మంత్రులుగా(Telangana Ministers) ప్రమాణ స్వీకారం చేసిన 11 మందిలో.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అంచలంచెలుగా ఎదిగిన వారితో పాటు, అనతికాలంలోనే ఉన్నతస్థాయికి చేరిన నేతలున్నారు. వీరిలో కొందరు తొలిసారి మంత్రులు కాగా.. తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎక్కువసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేతగా ఉన్నారు. వారి విశేషాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆడాల్సిందే.. చూడాల్సిందే!

ఆడటానికే కాదు చూడటానికీ రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుంది. పెనుమంట్ర మండలంలోని ఒక మేజర్‌ గ్రామంలో ఆడటానికి నమోదు పూర్తి కాలేదు గానీ చూడటానికి మాత్రం దాదాపు ఐదు వేల మంది ప్రేక్షకులను వాలంటీర్లు నమోదు చేశారు. ఏదోటి చేయకపోతే ఉన్న చిన్నపాటి ఉద్యోగానికి ఎసరు పెడతామని పై అధికారులు ఒత్తిడి చేయడమే దీనికి కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగనన్నా.. కాలనీలకు వెళ్లేదెలా..?

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలకు వెళ్లే దారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చాలా చోట్ల లే అవుట్‌కు వెళ్లే రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నవారు సామగ్రి, యంత్ర పరికరాలు తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. వీటన్నింటినీ చూసి పలువురు నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. కొందరు అసలు ముందుకు రావట్లేదు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎల్‌ఆర్‌ఎస్‌పై ముందుకా.. వెనక్కా!

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మొదలుపెట్టిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియ ముందుకు సాగుతుందా.. నిలిచిపోనుందా అనే విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యలో ఆగిపోయిన ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎన్నికల ముందు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రొటెం స్పీకర్‌ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ

రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మనమ్మాయి.. కొరియా అంబాసిడర్‌!

గ్లోబల్‌ స్టార్‌.. పేరు వినగానే ప్రియాంక చోప్రా గుర్తొస్తుంది కదా! అనుష్కా సేన్‌కి కూడా ఈ పేరుంది. అంతేకాదు.. తాజాగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన కార్యక్రమంలో దేశానికి ప్రాతినిధ్యం వహించింది కూడా. 21 ఏళ్లమ్మాయికి ఇదెలా సాధ్యమైందంటే.. అనుష్క స్వస్థలం ఝార్ఖండ్‌. నాన్న ఉద్యోగరీత్యా ఈమె చిన్నతనంలోనే ముంబయికి మారారు. ఏడేళ్ల వయసులో అనుష్కకి ఓ టీవీ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ద్విచక్ర వాహనం కొంటున్నారా?

రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలు ఒక అంతర్భాగం. చాలామంది దీనిని సొంత డబ్బులతోనే కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు రుణంతో తీసుకుంటారు. బ్యాంకులు ద్విచక్ర వాహనాల రుణాలను కాస్త ప్రత్యేకంగానే చూస్తాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన రుణాన్ని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలను చూద్దాం. చాలామంది ద్విచక్ర వాహనం కొన్నప్పుడే తొలి అప్పు తీసుకుంటారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్‌ (ప్రధాన పరీక్ష) తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్‌ జరుగుతుందన్నమాట. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విరాట్‌ నిర్ణయం ఏమిటో?

నిరుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత ఓటమి తర్వాత రోహిత్‌, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కూ దూరంగా ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్‌ ఉండాలని బోర్డు కోరుకుంటోంది. మరి కోహ్లి పరిస్థితి ఏంటన్నదే తేలాలి. ఇటీవల ఒకే వన్డే ప్రపంచకప్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని