Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Apr 2024 20:59 IST

1. ఈ మూడు నెలలు ‘మండే కాలమే’ - ఐఎండీ హెచ్చరిక

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి (Extreme Heat) వాతావరణం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కవితకు ఇంటి భోజనం.. పుస్తకాలు, జపమాలకు అనుమతి

హాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్‌ చేసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముక్కావారిపల్లె సర్పంచ్‌ అరవ శ్రీధర్‌ జనసేనలో చేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తిరుమల ఘాట్‌ రోడ్డులో తప్పిన ప్రమాదం

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారును ఓవర్ టేక్‌ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సు శేషచలం లోయలో పడకుండా ఓ చెట్టు అడ్డుగా నిలిచింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పార్కింగ్‌ వివాదం.. నటిపై కేసు నమోదు..?

కోలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి శరణ్య పొన్వన్నన్‌ (Saranya Ponvannan). తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్‌ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో శరణ్యపై ఓ మహిళ కేసు నమోదు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెబ్బేరులో అగ్నిప్రమాదం.. 12.88 లక్షల గన్నీ సంచులు దగ్ధం!

వనపర్తి జిల్లా పెబ్బేరులోని మార్కెట్‌ యార్డు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంలో 12.88 లక్షల గన్నీ సంచులు దగ్ధమైనట్లు సమాచారం. పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు సైతం మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 3 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ కీలక భేటీ

ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ భేటీ కానుంది. ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీల ఓనర్లకు బీసీసీఐ సమాచారం అందించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్‌ అరుణ్ సింగ్ ధుమాల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి.. రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు

భారత్‌ నుంచి రక్షణ రంగ ఎగుమతులు (Defence Exports) ఆల్‌ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హవాన సిండ్రోమ్‌ వెనుక రష్యా గూఢచారులు!

అమెరికా దౌత్యవేత్తలను ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న హవాన సిండ్రోమ్‌ (Havana Syndrome)  వెనుక రష్యా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ది ఇన్‌సైడర్‌, సీబీఎస్‌ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులో ఈ మేరకు ఆరోపించాయి. లాత్వియాకు చెందిన రిగా అనే గ్రూప్‌ కూడా వీటితో కలిసి పనిచేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని