Top Ten Stories odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. పది ముఖ్యమైన కథనాలివే!
Top Ten Stories: ఒడిశా రైలు విషాదానికి సంబంధించిన పది ముఖ్యమైన కథనాలు మీ కోసం...
1. తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి..
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన అనే యువకుడు తన తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలేశ్వర్ వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్తుండగా.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అర్ధరాత్రి వేల మంది రక్తదానం.. స్థానికుల మానవత్వం
3. భారతీయ రైల్వేలో.. మహా విషాదాలు!
మన దేశంలో రైల్వే (Indian Railways) తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 170 ఏళ్లు అయ్యింది. ఈ పదిహేడు దశాబ్దాల్లో భారత రైల్వే ప్రగతి సాధిస్తూ.. కోట్ల మంది ప్రయాణికుల కీలక రవాణా మార్గంగా నిలిచింది. ఈ క్రమంలో రైల్వేలో మానవ తప్పిదాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రైలు ప్రమాదం.. సాంకేతిక లోపమా..?మానవ తప్పిదమా?
ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికపరమైన సమస్యనా? లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొనడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టాలపై ఈ భారీ విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలివే
7. 14 ఏళ్ల క్రితం.. శుక్రవారం నాడు.. ఇదే కోరమాండల్!
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా భారీ సంఖ్యలో ప్రయాణికులు బోగీల కింద చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకుతెస్తోంది. అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 300 ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 200 అంబులెన్సులు.. రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..!
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Odisha Train Tragedy) సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశ రైల్వే (Indian Railways) చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగగా.. విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు (NDRF) వైద్య బృందాలు, అంబులెన్సులు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. డ్రోన్ విజువల్స్
10. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Sharma: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!