Sukesh Chandrashekhar: సత్యేంద్ర జైన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి..!
ఆర్థిక నేరగాడు, రూ.200కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆప్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వారి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎల్జీకి లేఖ రాశాడు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం ఓ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్, జైళ్ల శాఖ డీజీపీ సందీప్ గోయల్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనాకు లేఖ రాశాడు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరాడు. ఆ దర్యాప్తు పూర్తయితే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ల అసలు రూపం తెలుస్తుందని పేర్కొన్నాడు. ఒక వేళ దర్యాప్తు మొదలుపెడితే తాను వారితో భేటీ అయిన విషయాలు, క్యాష్‌ను ఎన్నిసార్లు అందజేసింది, ఎక్కడెక్కడ ఇచ్చింది వంటి సమాచారం కూడా ఇస్తానని తెలిపాడు.
గతంలో తాను చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయడంతో జైలు అధికారుల నుంచి తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సుకేశ్ వెల్లడించాడు. ఆప్‌పార్టీ కార్యకర్తల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆరోపించాడు. ‘‘సర్.. వారికి బెదిరిపోయి ఈ అభ్యర్థన చేయడం లేదు. నాపై ఒత్తిడి తీవ్రంగా పెరిగి పోయింది. ఆప్ గురించి సమాచారం బయటపెట్టకముందే ఏదైనా అనుకోని ఘటన చోటు చేసుకోవచ్చు. ఈ వ్యహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించండి’’ అని తన లేఖలో సుకేశ్ కోరాడు. ఈ మేరకు ఓ లేఖను తన న్యాయవాది అశోక్ సింగ్ ద్వారా పోస్టు చేశాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ తన నుంచి బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని ఇటీవల ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి జైన్ తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్‌పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.