JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్‌ మండపంలో అగ్నిప్రమాదం

పుణెలోని ఓ గణేశ్‌ మండపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో భాజపా (BJP) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అక్కడే ఉన్నారు. 

Published : 27 Sep 2023 02:06 IST

పుణె : భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) ప్రమాదం తప్పింది. పుణెలోని సానే గురూజీ తరుణ్‌ మిత్ర మండల్‌ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఆయన పూజలు చేస్తుండగా.. ఆ మండపం మంటల్లో చిక్కుకుంది. గణేశుడి మండపాన్ని ఉజ్జయిని మహాకాళి ఆలయ నమూనాలో రూపొందించారు. దాని శిఖర భాగంలో మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడకు వచ్చిన నడ్డా ఈ సమాచారం తెలియగానే వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను పక్కకు తీసుకెళ్లినట్లు తెలిసింది. మంటలు ఎగసిపడిన కాసేపటికే భారీ వర్షం కురిసింది. దాంతో నిమిషాల వ్యవధిలో మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను మండప నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. 

గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ

అంతకముందు జేపీ నడ్డా ముంబయిలోని పలు గణేశ్‌ మండపాలను దర్శించుకుని, పూజలు చేశారు. తొలుత ఆయన గిర్‌గావ్‌లోని కేశవ్‌జీ చాల్‌ గణేషోత్సవ్‌ మండల్‌లో కొలువుదీరిన విఘ్ననాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాన్కులే, ముంబయి భాజపా చీఫ్‌ ఆశీష్‌ షెలార్‌, భాజపా జాతీయ కార్యదర్శి వినోద్‌ టాడ్వే ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని