కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి

జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది.

Published : 03 May 2024 05:30 IST

 రాష్ట్రాలను కోరిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సమాచారం పంపింది. సులభతర పోలీసింగ్‌, న్యాయాలతో కూడిన యుగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాల్లో ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణమైన అనేక కొత్త అంశాలు ఉన్నట్లు అందులో పేర్కొంది. బ్రిటిష్‌ వలస పాలన కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ద కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌, ద ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్స్‌-1872ల స్థానంలో వీటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టాలపై పోలీసు, జైలు అధికారులకు అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌ అండ్‌ డి) కొత్త చట్టాలపై శిక్షకుల శిక్షణ మాడ్యుల్‌, వివిధ స్థాయుల్లోని పోలీసు, జైళ్ల శాఖ సిబ్బంది కోసం శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని