పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం

అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

Published : 17 May 2024 03:18 IST

మాల్దా: అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉందని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని