శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగింది.

Published : 03 May 2024 05:32 IST

పురావస్తు స్థలాల చట్టం నిబంధనలు వర్తిస్తాయి
అలహాబాద్‌ హైకోర్టులో హిందువుల వాదనలు

ప్రయాగరాజ్‌: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈద్గా మసీదును తొలగించాలన్న పిటిషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హిందువుల తరఫు న్యాయవాది హరి శంకర్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని తెలిపారు. శ్రీకృష్ణ ఆలయం రక్షిత కట్టడమని, ప్రాచీన నిర్మాణాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం-1958ను దీనికి వర్తింపజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించడం భక్తుల హక్కని, ప్రార్థనా స్థలాల చట్టం దీనిని అడ్డుకోజాలదని తెలిపారు. జస్టిస్‌ మయాంక్‌ జైన్‌ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ముస్లింల తరఫు న్యాయవాది తస్లిమా అజీజ్‌ అహ్మదీ వాదనలు వినిపిస్తూ... షాహి ఈద్గా మసీదును తొలగించాలన్న పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపారు. ప్రార్థనాస్థలాల చట్టం అందుకు అనుమతించదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని