అఫ్గాన్‌లో వైమానిక దాడుల హోరు

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. భద్రత బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరుతో అక్కడ రక్తం ఏరులై పారుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో తాము జరిపిన

Published : 09 Aug 2021 05:20 IST

 24 గంటల్లో 572 మంది తాలిబన్ల హతం

మరో 309 మందికి గాయాలు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. భద్రత బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరుతో అక్కడ రక్తం ఏరులై పారుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో తాము జరిపిన వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమయ్యారని అఫ్గాన్‌ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు తాలిబన్లూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసబెట్టి నగరాలను ఆక్రమించేస్తున్నారు. తాజాగా కీలక కుందుజ్‌, తలేకన్‌, సర్‌-ఎ-ఉల్‌ నగరాలను తమ వశం చేసుకున్నారు. నంగర్హర్‌, లఘ్మన్‌, ఘజ్నీ, పక్తియా, పక్తికా, కాందహార్‌, హెల్మండ్‌, కుందుజ్‌ సహా పలు ప్రావిన్సుల్లో అమెరికా దళాల మద్దతుతో అఫ్గాన్‌ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 572 మంది తాలిబన్లు మృత్యువాతపడ్డారని, మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ రక్షణ శాఖ ట్విటర్‌ వేదికగా తెలిపింది.

మరోవైపు- అఫ్గాన్‌ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా.. తాలిబన్లు ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే కుందుజ్‌, సర్‌-ఎ-ఉల్‌, తలేకన్‌ నగరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. కుందుజ్‌లో గవర్నర్‌ కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం, కారాగారం కూడా వారి నియంత్రణలోనే ఉన్నాయి. జైలు నుంచి 500 మంది ఖైదీలను వారు విడుదల చేశారు. అందులో తాలిబన్లు కూడా ఉన్నారు. కుందుజ్‌ను ఆక్రమించడాన్ని తమ ఘన విజయంగా తాలిబన్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని