ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచినా ఒకే పింఛను

మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని

Published : 26 Mar 2022 05:54 IST

పంజాబ్‌ సీఎం కీలక నిర్ణయం

చండీగఢ్‌: మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ.75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరవాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని మాన్‌ శుక్రవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే అవకాశమివ్వాలంటూ చేతులు జోడించి ఓట్లు అభ్యర్థించే నేతలు.. తర్వాత భారీమొత్తాల్లో పింఛన్లు పొందడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని