Obesity: డీఎన్‌ఏ లోపంతో స్థూలకాయం

చాలామంది మహిళలు టైప్‌ 2 మధుమేహం వచ్చే ముందు (ప్రీడయబిటిస్‌), వచ్చిన తరవాత స్థూలకాయులవుతారు. డీఎన్‌ఏలోని ల్యూకోసైట్‌ టెలోమిర్‌ లెంగ్త్‌ (ఎల్‌.టి.ఎల్‌) అనే బయోమార్కర్‌ దేహ

Updated : 06 Aug 2022 05:42 IST

దిల్లీ: చాలామంది మహిళలు టైప్‌ 2 మధుమేహం వచ్చే ముందు (ప్రీడయబిటిస్‌), వచ్చిన తరవాత స్థూలకాయులవుతారు. డీఎన్‌ఏలోని ల్యూకోసైట్‌ టెలోమిర్‌ లెంగ్త్‌ (ఎల్‌.టి.ఎల్‌) అనే బయోమార్కర్‌ దేహ స్థౌల్యానికి కారణమని 2015-20 మధ్య కాలంలో ఉత్తర భారతంలో జరిగిన అధ్యయనం తేల్చింది. దిల్లీలోని ఫోర్టిస్‌ సీడాక్‌ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం ఈ అధ్యయనం జరిపింది. 20-60 ఏళ్ల వయోవర్గంలోని 1,361 మంది మహిళలను అధ్యయనానికి ఎంచుకున్నారు. వారిలో 797 మంది ప్రీడయబిటిక్‌ మహిళలు కాగా, వారిలో 492 మంది స్థూలకాయులు. ప్రీడయబిటిస్‌ కేసుల్లో రక్తంలో చక్కెర స్థాయి మామూలు వ్యక్తులకన్నా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ కేసులు ఇంకా పూర్తిస్థాయి టైప్‌ 2 డయబిటిస్‌గా మారని కేసులు. ఎల్‌.టి.ఎల్‌ బయోమార్కర్‌ పుట్టిన సమయంలో పొడవుగా ఉండి కౌమార దశ వచ్చేవరకు వేగంగా పొట్టిదైపోతుంది. ఆ తరువాత వృద్ధాప్యం వరకు నెమ్మదిగా కురచదవుతూ వస్తుంది. ముదిమి మీదపడటం, హృద్రోగాలు, స్థూలకాయం, టైప్‌ 2 మధుమేహాలకు ఎల్‌.టి.ఎల్‌ కురచదనమే కారణం. మధుమేహ ముందస్తు దశలోనూ అది కురచగా మారుతుందని తాజా అధ్యయనం నిర్ధారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని