మహిళా శక్తికి ప్రతీక దేవీ చాముండేశ్వరి

మహిళా శక్తికి ప్రతీక దేవీ చాముండేశ్వరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుతించారు. విశ్వవిఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఆమె సోమవారం ప్రారంభించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక  ఆమె పర్యటించిన తొలి రాష్ట్రం కర్ణాటక కావటం విశేషం.

Updated : 27 Sep 2022 05:38 IST

శ్లాఘించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం

ఈనాడు, బెంగళూరు: మహిళా శక్తికి ప్రతీక దేవీ చాముండేశ్వరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుతించారు. విశ్వవిఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఆమె సోమవారం ప్రారంభించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక  ఆమె పర్యటించిన తొలి రాష్ట్రం కర్ణాటక కావటం విశేషం. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మైసూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. నేరుగా చాముండి కొండకు వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తికి పుష్పార్చన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తన ప్రసంగాన్ని కన్నడ భాషలో రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ వేడుక భారతీయ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. రామాయణ, మహాభారతాల్లోనూ చాముండేశ్వరి ఆరాధనను ప్రస్తావించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, శోభా కరంద్లాజె, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

మహిళల ప్రాధాన్యం పెరగాలి
సమాచార, సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. ధార్వాడలో ట్రిపుల్‌ ఐటీ నూతన కట్టడాన్ని ప్రారంభించాక ఆమె మాట్లాడారు. కర్ణాటక పర్యటనలో భాగంగా రాష్ట్రపతికి హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు 900 గ్రాముల సిద్ధారూఢ స్వామి వెండి విగ్రహాన్ని బహుకరించారు. మంగళవారమూ కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. విధానసౌధలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని సత్కరించనుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని