74 శాతం గ్రామీణులకు ప్రతిరోజూ నీటి సరఫరా

దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎనిమిది శాతం మందికి వారానికి ఒకరోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరోపక్క ప్రతిరోజూ నీటిని పొందుతున్నవారు సుమారు 74 శాతం మంది ఉన్నారు. ఈ మేరకు తాజాగా గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది.

Published : 03 Oct 2022 03:33 IST

8% మందికి వారానికి ఒక్కరోజే

దిల్లీ: దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎనిమిది శాతం మందికి వారానికి ఒకరోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరోపక్క ప్రతిరోజూ నీటిని పొందుతున్నవారు సుమారు 74 శాతం మంది ఉన్నారు. ఈ మేరకు తాజాగా గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది. దీనిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసింది. ఆ ప్రకారం 14 శాతం మంది వారంలో మూడు నాలుగు రోజులు నీటి సరఫరాను పొందుతున్నారు. దేశంలో సగటున నీటి సరఫరా రోజుకు మూడు గంటలుగా తేలింది. తమ రోజువారీ అవసరాలకు కుళాయి కనెక్షన్‌ ద్వారా వచ్చే నీరే సరిపోతోందని ప్రతి అయిదుగురిలో నలుగురు(80శాతం) తెలిపారు. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో ఎక్కువ మందికి కుళాయి నీటి సౌకర్యమేలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని