china: అమెరికాలో పుట్టాడు.. చైనా కోసం పనిచేశాడు..

చైనాలోని వుహాన్‌ యూనివర్శిటీ కోసం   హార్వర్డు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఒకరు రహస్యంగా పనిచేసినట్లు తేలింది. ఈ విషయాన్ని నేడు అమెరికా అధికారులు

Published : 23 Dec 2021 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలోని వుహాన్‌ యూనివర్శిటీ కోసం   హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఒకరు రహస్యంగా పనిచేసినట్లు తేలింది. ఈ విషయాన్ని నేడు అమెరికా అధికారులు నేర నిరూపణ చేశారు. హర్వర్డుకు చెందిన చార్లీ లియోబెర్‌ కెమికల్‌ బయాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఆయన 2011లో వుహాన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా చేరారు. నెలకు 50వేల డాలర్ల జీతం తీసుకొన్నాడు. ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధనశాల ఏర్పాటు, పరిశోధన పత్రాల ప్రచురణకు 1.5 మిలియన్‌ డాలర్లను స్వీకరించినట్లు తేలింది. కానీ, ఈ విషయాలు ఏమీ అమెరికా అధికారులకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. అంతేకాదు అమెరికా రక్షణశాఖ, అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి 15 మిలియన్‌ డాలర్ల అవార్డు కూడా స్వీకరించాడు కూడా.  

అమెరికాలో ఆర్థిక గూఢచర్యం నిర్మూలనకు అమెరికా చేపట్టిన చర్యల్లో భాగంగా ఈయనపై కేసు నమోదైంది. తాజా ఈ కేసులో ఆయన అభియోగాలు నిరూపించారు. హర్వర్డు క్రిమ్సన్‌ప్రకారం ఆ ప్రొఫెసర్‌కు 26 ఏళ్ల జైలు, 1.2 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 2018లో నాటి అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో పరిశోధన ఫలాలు చైనా దొంగిలించకుండా అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘చైనా ఇనీషియేటీవ్’ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా చార్లీ లియోబెర్‌ వ్యవహారం బయటపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని