Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం

భారత్‌లో ప్రవేశించాలన్న ఉగ్రకుట్రను భద్రతా బలగాలు విఫలం చేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండును సైన్యం స్వాధీనం చేసుకుంది. 

Published : 15 Jun 2023 23:28 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట భారత్‌లో ప్రవేశించాలన్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నట్టు సైన్యం గురువారం ప్రకటించింది. ‘‘భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌ ద్వారా ఈ నెల 14, 15 రాత్రివేళల్లో కృష్ణఘాటి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశాం. బుధవారం బాగా పొద్దుపోయాక చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరపడంతో వారంతా తప్పించుకుని పారిపోయారు’’ అని జమ్మూలోని సైనిక స్థావరం పౌర సంబంధాల అధికారి కర్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ వెల్లడించారు. ఎల్‌వోసీ పరిధిలో గల సర్లా గ్రామంలో గురువారం తెల్లవారుజామున చేపట్టిన గాలింపు సందర్భంగా ఆయుధాలు దొరికినట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందిన కచ్చితమైన సమాచారం మేరకు సైన్యం నిర్వహించిన సోదాల్లో రెండు బ్యాగుల్లో ఓ ఏకే సిరీస్‌ రైఫిల్‌, 9 మేగజీన్లు, 438 స్టీల్‌ కోర్‌, సాధారణ బుల్లెట్లు, రెండు పిస్తోళ్లు, నాలుగు మేగజీన్లు, 60 బుల్లెట్లు, ఆరు గ్రెనేడ్లు, పాకిస్థాన్‌ తయారీ మందులు లభ్యమయ్యాయి. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని