Rakesh Tikait: మోదీ.. రైతులను దేశం నుంచి వేరు చేసి చూస్తున్నారు: టికాయిత్‌

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా, దిల్లీ తదితర ప్రాంతాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ధర్నాలను కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం ఏమాత్రం

Published : 08 Nov 2021 22:56 IST

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా, దిల్లీ తదితర ప్రాంతాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ధర్నాలను కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం కనీసం సానుభూతి తెలపలేదు. దేశ రైతులు మోదీని రైతు పక్షపాతిగా భావించట్లేదు. రైతులను మోదీ దేశం నుంచి వేరు చేసి చూస్తున్నట్లు భావిస్తున్నారు’’అని టికాయిత్‌ చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే టికాయిత్‌ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. నవంబర్‌ 26 వరకు రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. దేశ రాజధాని సరిహద్దుల్లో టెంట్లు వేసి ఆందోళన చేపడతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని