నీతీశ్‌ యూటర్న్‌: ఈడీ ముందుకు లాలూ.. బిహార్‌లో రాహుల్‌

మనీలాండరింగ్ కేసులో నేడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) ఈడీ కార్యాలయానికి వెళ్లారు. 

Published : 29 Jan 2024 12:15 IST

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్(Lalu Prasad Yadav) సోమవారం పట్నాలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భూములు తీసుకుని.. బదులుగా రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో ఇటీవల లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు బిహార్‌లోకి ప్రవేశించింది. నీతీశ్‌ కుమార్‌ భాజపాతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఈ యాత్రపై ఆసక్తి నెలకొంది. యూటర్న్‌కు ముందు కాంగ్రెస్‌, ఆర్జేడీతో నీతీశ్‌ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని