By Elections: నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఉప ఎన్నికల పోలింగ్‌..

 ఛత్తీస్‌గఢ్‌,పశ్చిమ బెంగాల్‌, మహరాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి.

Updated : 18 Apr 2022 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, మహరాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టంలోని పశ్చిమ బర్ధమాన్‌ జిల్లా అసనసోల్‌ లోక్‌ సభ స్థానంతో పాటు బాలిగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌, బిహార్‌లోని బోచాహన్‌, మహరాష్ట్రలోని కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)లో చేరిన బాబుల్‌ సుప్రియో లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో అసన్‌పోల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఇక్కడ టీఎంసీ నుంచి  శత్రఘ్నసిన్హా, భాజపా నుంచి అగ్నిమిత్ర పాల్‌లు పోటీ పడుతున్నారు. అయితే పోలింగ్‌ నేపథ్యంలో.. టీఎంసీ కార్యకర్తలు తనపై రాళ్లతో దాడి చేశారని మిత్ర పాల్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని