Prabhas sreenu: ప్రభాస్ రాజైతే.. నేను మంత్రినట...: ప్రభాస్ శ్రీను
కొన్ని వందల సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు తులసి, ప్రభాస్ శ్రీను. వీళ్లిద్దరూ కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో కొన్ని విశేషాలు పంచుకున్నారు.
బాల నటిగా మొదలై.. హీరోయిన్గా, సహాయనటిగా తులసిది ఓ అద్భుతమైన నట ప్రస్థానం. కామెడీతోపాటు నెగెటివ్ పాత్రల నటుడిగా ప్రభాస్ శ్రీనుది ఓ వినూత్న సినీ ప్రయాణం. వారి సహజసిద్ధమైన నటనతో ఆడియన్స్‌ను అలరిస్తూ.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ టాలెంటెడ్ నటులిద్దరూ ఆలీతో కలిసి పంచుకున్న విషయాలెంటో చూద్దాం..
మీరిద్దరికి ఏ సినిమా నుంచి పరిచయం?
తులసి: ఆ ‘డార్లింగ్’ వల్ల ఈ డార్లింగ్ దొరికాడు(సరదాగా). డార్లింగ్ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమాలో శ్రీను చాలా బాగా నటించాడు. ఫైటింగ్ సన్నివేశాల్లో కూడా కామెడీ చేశాడు. వెంటనే తనకు ఫోన్ చేసి అభినందించాను. అప్పటి నుంచి మా ప్రయాణం అలాగే కొనసాగుతోంది.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదేంటి? మీకు భక్తి ఎక్కువట నిజమేనా?
ప్రభాస్ శ్రీను: అలా ఏమి లేదు. కొవిడ్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. ప్రస్తుతం ప్రభాస్‌తో ఉంటున్నా. మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేస్తున్నాను. నాకు భక్తి చాలా ఎక్కువ. వినాయకుడి భక్తుడిని. చిన్నప్పటి నుంచి నాకు చదువుపై ఆసక్తి లేదు. నన్ను డాక్టర్ని చేయలన్నది మా నాన్న కల. నేను డాక్టర్ కాకుండా యాక్టర్ అయ్యానని ఆయనకు బాధలేదు. నా విజయాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రభాస్‌తో పరిచయం ఎలా అయింది?
ప్రభాస్ శ్రీను: నేను సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ప్రభాస్ కూడా ఉన్నారు. ఆయన బ్యాచ్‌లో మేము కో-ఆర్టిస్టులం. అలా ఏర్పడిన పరిచయం ఇప్పటి దాకా కొనసాగుతోంది. ఇప్పుడు ఆయనకు సహాయకుడిగా ఉంటున్నా.
సినీపరిశ్రలోకి అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది?
తులసి: నాకు 56 ఏళ్లు. నేను ఇండస్ట్రీకి వచ్చి 56 సంవత్సరాలైంది. నాకు 3 నెలలు ఉన్నప్పుడు నటించాను. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు డైలాగ్ చెప్పాను. ఇక అప్పటి నుంచి అలా కొనసాగుతూ పోతుంది ఈ జర్నీ. మా అమ్మకు సావిత్రిగారికి బెస్ట్ ఫ్రెండ్. నన్ను చూడడానికి ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత రోజు షూటింగ్‌కు ఓ బాబు కావాల్సి వచ్చింది. వెంటనే సావిత్రి గారు నన్ను తీసుకుని వెళ్లారు. అలా మొదటిసారి ‘భార్య’ సినిమాలో నాకు 3నెలలు ఉన్నప్పుడు తెరపై కనిపించా. తెలుగులో 76 సినిమాలు చేశా. కన్నడలో 18, మలయాళంలో 36, హిందీలో ఒక సినిమా హీరోయిన్గా చేశాను.
ప్రభాస్ శ్రీను: నేను ఇప్పటివరకూ 300 సినిమాల్లో చేశాను. పెద్దసినిమానా, చిన్న సినిమానా అని చూడను. రోజు షూటింగ్‌కు వెళ్లాలి అంతే. రెమ్యునరేషన్ కూడా ఇంత ఇవ్వండి అని నేను ఎప్పుడూ డిమాండ్ చేయను. పనిపై శ్రద్ధతో చేయాలి. నేను ఓసారి పేజీ డైలాగ్‌ను సింగిల్టేక్లో చెప్పాను. అందరూ లేచి క్లాప్స్ కొట్టారు.
నెగెటివ్ అనే పదం పలకడానికి కూడా ఇష్టపడవట ఎందుకు? మీ సాయి ఎలా ఉన్నాడు? ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?
తులసి: మనం ఒక మాట మాట్లాడితే అది ఎక్కడకు వెళ్లినా తిరిగి మన దగ్గరకే వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు నేను పాజిటీవ్‌గానే మాట్లాడతాను. కార్తికేయ2 సినిమా ఫంక్షన్లో స్పీచ్ వల్ల నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. సాధ్యమైనంత వరకు నేను మంచిమాటలే మాట్లాడతాను. మా అబ్బాయి సాయి చాలా బాగున్నాడు. విక్రమ్ సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం నేను జయం రవితో ఓ పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నా. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా.
మీరు దెయ్యమట నిజమేనా? చిన్నప్పుడే లెజెండరీ దర్శకుడికి సినిమాలకు సంబంధించిన సలహాలు ఇచ్చేవారటగా?
తులసి: ఇండస్ట్రీలో చాలా మంది నన్ను దెయ్యం అనే పిలుస్తారు. జయసుధ, మంజుల, శోభానాయుడు వీళ్లందరూ నన్ను ఆటపట్టిస్తుంటారు. ఆ సలహాల విషయమేమిటంటే.. దాసరి నారాయణరావుగారు చాలా నెమ్మదస్తులు. నన్ను చాలా మురిపెంగా చూసుకునే వారు. ఒకసారి పిలిచి ఒళ్లో కూర్చొబెట్టుకుని షాట్ చెప్పమన్నారు. చెప్పేశాను.
జాతకాలు చెబుతారా?ఎవరో దర్శకుడికి జాతకం చెబితే.. మీరు చెప్పినట్లే జరిగిందట?
తులసి: నేను మనిషిని చూసి వాళ్ల గురించి కొంచెం అంచనా వేయగలను. ఎక్కువగా పాజిటీవ్ విషయాలనే చెబుతాను. కోడి రామకృష్ణ పెద్దమ్మాయికి జాతకం చెప్పాను. నేను చెప్పిందే జరిగిందని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చింది. అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. నాకు మంచి మాటలు చెప్పడానికి ఒకప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నాను. నాకు తెలిసిందే అందరికీ చెబుతాను. మంచి విషయాలు చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
మీ ఎడమ కన్ను దెబ్బకు, వెంకటేశ్వర స్వామికి ఏంటి సంబంధం?
తులసి: మేము శ్రీనివాస కల్యాణం అని ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం . దానికోసం మేకప్ వేసుకుని అలానే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే మా ఇంట్లో వాళ్లు బీరువా కదిలించారు. దాని తాళం నా కంటికి గుచ్చుకుంది. కుట్లుపడ్డాయి. అంతే తిరుపతికి రిహార్సల్స్‌కు వెళ్లాను. అక్కడ పెద్దపూజారి నా దగ్గరకు వచ్చి వెంకటేశ్వర స్వామికి కట్టిన వస్త్రాన్ని కంటి మీద పెట్టారు. నేను అప్పుడు నమ్మలేదు. తర్వాత డాక్టర్ దగ్గరకు వెళితే ‘నువ్వు అదృష్టవంతురాలివి.. కన్ను పోతుందనుకున్నాం. కానీ ఏమీ జరగలేదు’ అన్నాడు. ఆ వస్త్రం వల్లనే నాకు కన్ను ఉందని నేను ఇప్పటికీ అనుకుంటుంటా.
మీరు జంతువులతో మాట్లాడతారట? మీది ప్రేమ వివాహమా?
ప్రభాస్ శ్రీను: ఇంట్లో ఎవరూ మాట్లాడకపోతే ఏం చేస్తాం(నవ్వుతూ). మా ఇంట్లో చేపలతొట్టి(అక్వేరియం) ఉంది. అందులో 6 చేపలు ఉన్నాయి. రాత్రి పూట వాటితో మాట్లాడుతూ ఉంటా. షూటింగ్లో జరిగిన విషయాలన్ని వాటికి చెబుతుంటా. మాది ప్రేమ వివాహమే. ముందు నేను ప్రేమించాను. తర్వాత మా ఆవిడ నన్ను ప్రేమించాల్సి వచ్చింది(నవ్వుతూ).
నిన్ను మంత్రి అని పిలిచేది ఎవరు? ఫోన్లో ఏదోమాట మాట్లాడితే నీకు నచ్చదటగా ఏంటది?
ప్రభాస్ శ్రీను: కృష్ణంరాజు గారు నన్ను మంత్రి అని పిలుస్తారు. ప్రభాస్‌తో ఉంటాను కాబట్టి ఆయన రాజుగారు, నేను మంత్రిని. ఎవరైనా ఫోన్‌చేసి ‘నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నా..’ ఇలా అంటే నాకు నచ్చదు. పేరేంటో చెప్పకుండా ఊరి పేరు చెబితే నాకు కోపం వస్తుంది. డ్యాన్స్ కూడా అంతే పాట పెట్టి వేయమంటే ఎంతసేపైనా వేస్తా. ఇలానే వేయాలి.. అలానే వేయాలి అంటే నాకు రాదు.
చిన్నప్పుడు దాదాగిరి చేసేవారా?
తులసి: దాదాగిరి ఏంటి..అన్ని గిరీలు చేశాను(నవ్వుతూ). కోపమెస్తే కొట్టేదాన్ని.
ప్రభాస్ శ్రీను: ఊర్లో సెకండ్ షో సినిమా చూడడానికి పక్క ఊరి వాళ్లు వచ్చేవాళ్లు. సైకిల్ మీద వెళ్లేవాళ్లని ఆపి డబ్బులు వసూలు చేసేవాడిని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్‌గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్‌కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్‌పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్‌హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్‌హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్‌లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్‌బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి