Anasuya Bharadwaj: విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకోకండి: అనసూయ విజ్ఞప్తి

విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకోకండి అని పలు మీమ్‌ పేజెస్‌, వెబ్‌సైట్స్‌కు యాంకర్‌ అనసూయ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 05 Nov 2023 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యూస్‌ కోసం కొన్ని మీమ్‌ పేజెస్‌, వెబ్‌సైట్స్‌ తన ప్రస్తావనను మరోసారి తీసుకొచ్చాయని వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya Bharadwaj) అసహనం వ్యక్తం చేశారు. అంతగా దిగజారడం, అసమంజసంగా ఉండడం, మ్యానిప్యులేట్‌ చేయడాన్ని ఆపాలని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ‘‘తలాతోక లేకుండా మీకు క్లిక్స్‌/వ్యూస్‌ వచ్చేలా ఎడిట్‌ చేసి వీడియోలు పెట్టడం ఆపండి. అయినా అర్థం చేసుకునే వారికి చెప్పనవసరంలేదు. కానీ, మొత్తం తెలుసుకునే సమయం లేనివారికి ఒక విజ్ఞప్తి.. దయచేసి మొత్తం విషయం తెలుసుకోకుండా ఒకరిని అపార్థం చేసుకోవద్దండి. అపార్థం చేసుకోవడం తేలిక. ఏది సరైందో దాన్ని నమ్మండి తప్ప తేలికైన దాన్ని కాదు’’ అంటూ #PeaceAndLove (శాంతి, ప్రేమ) అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు.

అందుకే హీరోయిన్ అవకాశాలు కోల్పోయాను: అనసూయ

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వారు క్రియేటర్స్‌. తమ ఫాలోవర్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటారు’ అని కామెంట్‌ చేశాడు. దానికి అనసూయ బదులిస్తూ.. ‘అందుకు ఒకరి క్యారెక్టర్‌/హార్డ్‌వర్క్‌/ఫేమ్‌ని పణంగా పెడతారా? వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారో అడగొచ్చా సర్‌? మ్యానిప్యులేషన్‌ను ఎప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అని పరిగణిస్తున్నారు?’’ అని అడిగారు. ఇటీవల అనసూయ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన మీమ్స్‌పైనే అనసూయ స్పందించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని