Published : 19/11/2021 20:27 IST

సందీప్‌ రెడ్డి వంగా - రణ్‌బీర్‌ కపూర్‌  ‘యానిమల్‌’ వచ్చేది అప్పుడే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా రాబోతున్న చిత్రం ‘యానిమల్‌’. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది.  2023 ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. తొలుత 2022 దసరా కానుకగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ కథ సాగుతుంది. ప్రకృతిలో ఓ కథానాయకుడు జంతువులా ఎలా మారాడనే ఆసక్తికర అంశాల చుట్టూ సాగేదే ‘యానిమల్‌’. ఇందులో రణ్‌బీర్‌ సరసన హీరోయిన్‌గా పరిణీతి చోప్రా నటిస్తోంది. విలన్‌ పాత్రలో బాబీ డియోల్‌, మరో కీలక పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు.  టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా.. బాలీవుడ్‌లో ‘ కబీర్‌ సింగ్‌’తో దర్శకుడిగా అడుగులు వేసిన సందీప్‌ మంచి హిట్‌ కొట్టారు. దీంతో రణ్‌బీర్‌ కలయికలో రాబోతున్న ఈచిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని