Anushka Sharma: సమస్య తీర్చిన సోనమ్‌

ప్రసవానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. తనకూ ఈ సమస్య ఎదురైందని, నటి సోనమ్‌ కపూర్‌ సలహా వల్ల దాన్నుంచి బయటపడ్డానని తెలియజేసింది బాలీవుడ్‌ నాయిక అనుష్క శర్మ.

Published : 25 Jun 2021 22:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రసవానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఇలా జరుగుతుంటుందనే విషయం తెలిసిందే. కొందరు వంటింటి చిట్కాలతో, మరికొందరు వైద్యుల సలహాలతో తమ సమస్యని పరిష్కరించుకుంటారు. తనకూ ఈ సమస్య ఎదురైందని, నటి సోనమ్‌ కపూర్‌ సలహా వల్ల దాన్నుంచి బయటపడ్డానని తెలియజేసింది బాలీవుడ్‌ నాయిక అనుష్క శర్మ. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుక్రవారం తన కొత్త హెయిర్‌ కట్‌ ఫొటోల్ని పంచుకుంది అనుష్క. ఇందులో తెల్లని టీ షర్ట్‌, పసుపు జాకెట్‌లో కనిపించింది. తన కురుల సమస్యకి చెక్‌ పెట్టి, అందంగా తీర్చిదిద్దినందుకు జార్జ్‌ నార్త్‌వుడ్‌ అనే క్షౌరశాలకి, దాన్ని పరిచయం చేసిన సోనమ్‌ కపూర్‌కి ధన్యవాదాలు తెలియజేసింది. 2017లో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క ఈ ఏడాది ఓ పాపకి జన్మనిచ్చింది. నటిగా కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నా నిర్మాతగా వ్యవహరిస్తోంది. సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లూ నిర్మిస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని