Bigg Boss Telugu 7: రతికకు శివాజీ హితబోధ.. శోభాశెట్టి తలపై పగిలిన బాటిల్..

బిగ్‌బాస్‌లో పదకొండో వారం నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Updated : 13 Nov 2023 16:24 IST

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Bigg Boss Telugu) పూర్తి భావోద్వేగాల మధ్య నడుస్తోంది. కుటుంబసభ్యులు వచ్చి పలకరించగా..  కంటెస్టెంట్లు ఆశ్చర్యానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పదకొండో వారం నామినేషన్‌ల ప్రక్రియను షురూ చేశాడు బిగ్‌బాస్‌.

గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులు చెప్పిన సలహాలను కంటెస్టెంట్‌లు ఈ నామినేషన్స్‌లో బాగా పాటిస్తున్నారు. ఈ వీక్‌ నామినేషన్స్‌కు సంబంధించి బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. నామినేట్‌ చేసిన వ్యక్తి తలపై బాటిల్‌ను పగలకొట్టాల్సి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. శోభాశెట్టిని నామినేట్‌ చేసిన రతిక.. కెప్టెన్‌గా సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించలేదని అందుకే నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పింది. అలాగే పల్లవి ప్రశాంత్‌ను అర్జున్‌ నామినేట్‌ చేస్తూ కారణాన్ని వివరించాడు.

ప్రియాంకపై మండిపడ్డ రతిక..

అలాగే రతికను ప్రియాంక నామినేట్‌ చేసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదన జరిగింది. తన ఎమోషన్‌ గురించి మాట్లాడినందుకు ప్రియాంకపై రతిక మండిపడింది. ఈ వాదనలో శివాజీ మధ్యలో వెళ్లగా అతడిని కూడా మాట్లాడొద్దని గట్టిగా చెప్పింది రతిక. ఇక అశ్విని శ్రీ కూడా ప్రియాంకపై గట్టిగా అరిచింది. దీంతో ఆమె మాట్లాడిన తీరు బాలేదని ఏమైనా ఉంటే నాగార్జునతో చెప్పాలంది ప్రియాంక. నాగార్జున హోస్ట్‌ మాత్రమేనని ఆయన కంటెస్టెంట్‌ కాదంటూ మళ్లీ ప్రియాంకతో రతిక వాదనకు దిగింది.

ముంబయిలో సాయి పల్లవి... ఆ సినిమాపై జోరందుకున్న ప్రచారం ..

ఇక ఈ నామినేషన్‌ ప్రక్రియకు ముందే రతికకు శివాజీ హితబోధ చేశాడు. ‘నీ టాలెంట్‌ చూపిస్తూ ఉండు. అవతలి వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. గేమ్ పూర్తయ్యే వరకూ అలానే ఉండడానికి ప్రయత్నించు’ అని చెప్పాడు. ఏదేమైనా ఈ వారం నామినేషన్స్‌ మాత్రం రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలను మీరూ చూసేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని