Sai pallavi: ముంబయిలో సాయి పల్లవి... ఆ సినిమాపై జోరందుకున్న ప్రచారం ..

నటి సాయి పల్లవి ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. దీంతో రామాయణం సినిమా కోసమే ఆమె అక్కడకు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Updated : 13 Nov 2023 12:20 IST

ఏఐతో రూపొందించిన ఇమేజ్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు నితీశ్‌ తివారీ ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ రూపొందించే పనిలో ఉన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి (Sai Pallavi), యశ్‌ ప్రధాన పాత్రధారులుగా దీన్ని తెరకెక్కించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫొటో ఎక్స్‌లో కనిపించింది. దీంతో ‘రామాయణం’ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ప్రస్తుతం సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ తనతో దిగిన ఓ ఫొటోను అభిమాని షేర్‌ చేశారు. దీంతో త్వరలోనే రామాయణం సినిమా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. అందుకే ఆమె ముంబయి వెళ్లారంటూ అభిమానులు కామెంట్స్‌పెడుతున్నారు. ఇక మరోవైపు ఈ చిత్రం కోసం అభిమానులు క్రియేట్‌ చేసిన ఏఐ ఇమేజ్‌లు కూడా వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఈ సినిమాలోని తారాగణం గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ.. రణ్‌బీర్‌ (Ranbir Kapoor), సాయి పల్లవిలే ఫిక్స్‌ అని టాక్‌ వినిపిస్తోంది.

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలేంటో తెలుసా?

ఇక రెండు భాగాలుగా దీన్ని తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారట. దీని రెగ్యులర్‌ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్‌ నిర్వహించనున్నారట. దీని కోసం శ్రీలంకలో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ గురించి గతంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా పెద్ద ప్రయత్నమని.. పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని