స్టేజ్‌పై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్‌

ఓ నటుడి అనుచిత ప్రవర్తనతో యాంకర్‌ ఇబ్బందిపడింది. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకుంది.

Updated : 20 Sep 2023 13:51 IST

చెన్నై: ఓ సినిమా ఫంక్షన్‌లో నటుడి అనుచిత ప్రవర్తనతో యాంకర్‌ ఇబ్బంది పడిన సంఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది. నటుడు చేసిన పనితో ఆమె ఆగ్రహానికి గురైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అందరూ ఆ నటుడి ప్రవర్తనను తప్పుపడుతున్నారు.

యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి.. అనతి కాలంలో ఫేమ్‌ సొంతం చేసుకున్నాడు కూల్‌ సురేశ్‌ (Cool Suresh). ఈ క్రమంలోనే అతడు తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. కాగా, తాజాగా మన్సూర్ అలీ ఖాన్ తెరకెక్కించిన ఓ సినిమా ప్రమోషన్‌లో సురేశ్‌ అతిథిగా పాల్గొన్నాడు. చిత్రబృందం గురించి మాట్లాడుతూ.. ఒక్కసారిగా పక్కనే ఉన్న యాంకర్‌ మెడలో పూలమాల వేశాడు. అతడి ప్రవర్తనతో ఆమె ఇబ్బందిపడింది. పూల మాల తీసి కింద పడేసి.. అసహనం వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది.

యాంకర్‌ ఇబ్బందిని అర్థం చేసుకున్న మన్సూర్‌ అలీఖాన్‌.. ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. అనంతరం సురేశ్‌ని సైతం క్షమాపణలు చెప్పాలని అడిగాడు. యాంకర్‌కు సారీ చెప్పిన సురేశ్‌.. ప్రచారం కోసమే తాను ఈ పని చేశానని చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించకూడదంటూ పలువురు ట్వీట్స్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని