Deepika Padukone: 18ఏళ్లలో ఆ చెత్త సలహా ఇచ్చారు.. అయినా ఆ పనిచేయలేదు

కెరీర్‌ ప్రారంభంలో సలహాలిచ్చేవారు చాలా మందే ఉంటారు. అలా తన జీవితంలోనూ ఎంతో మంది సలహాలిచ్చారని ఆనాటి రోజులను గుర్తుచేసుకుంది ప్రముఖ బాలీవుడ్‌ నటి, నిర్మాత దీపికా పదుకొణె.

Updated : 28 Feb 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌ ప్రారంభంలో సలహాలిచ్చేవారు చాలా మందే ఉంటారు. అలా తన జీవితంలోనూ ఎంతో మంది సలహాలిచ్చారని ఆనాటి రోజులను గుర్తుచేసుకుంది ప్రముఖ బాలీవుడ్‌ నటి, నిర్మాత దీపికా పదుకొణె. అందులో కొన్ని చెడు, మంచి సలహాలున్నాయని తాజాగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.

‘‘అప్పుడు నాకు 18 ఏళ్లు. సినిమాల కన్నా ముందు మోడలింగ్‌ చేసేదాన్ని. ఆ సమయంలో ఒకరు నా దగ్గరకు వచ్చి మీరు బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌ చేయించుకోండి అన్నారు. ఇది చెడుగా, ఇబ్బందికరంగా అనిపించినా.. వాటిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ వయసులోనే అంత సున్నితమైన అంశాలను పరిణతితో ఎలా ఆలోచించగలిగానా? అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక మంచి సలహా అంటారా.. కెరీర్‌లో నా రెండో చిత్రం , బాలీవుడ్‌లో నా మొదటి చిత్రం ‘ఓం శాంతి ఓం’. షారుక్ సరసన హీరోయిన్‌గా నటించా. షూటింగ్‌ సమయాల్లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా. మంచి సలహాలు కూడా ఇస్తుంటారాయన. ‘‘ఎప్పుడైనా సరే నీకు గుడ్‌ టైమ్‌ని పంచే వ్యక్తులతోనే పనిచేయి. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఓ సినిమా కానీ, పని కానీ చేస్తున్నామంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతున్నావు. అవే జ్ఞాపకాలు అవుతాయి. అనుభవాలను ఇస్తాయి’’ అందుకే పనివిషయంలో చుట్టుపక్కల వ్యక్తులు ఎలా ఉన్నారనేదీ కీలకమే’’ అని చెప్పుకొచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘గెహ్రాహియా’తో బోల్డ్‌ పాత్రలో నటించిన దీపిక.. ప్రస్తుతం ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌-కె’ అమితాబ్‌తో ‘ది ఇంటర్న్‌’ రీమేక్‌, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ చిత్రాలతో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని