‘ధాకడ్‌’ ముందుకు..‘అనేక్‌’ వెనక్కి!

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సృష్టించుకున్న కంగనా రనౌత్‌ కొత్త సినిమా ‘ధాకడ్‌’ టీజర్‌ మంగళవారం విడుదలయ్యింది. ‘వై షుడ్‌ బాయ్స్‌ హ్యావ్‌ ఆల్‌ ది ఫన్‌’

Published : 13 Apr 2022 01:44 IST

థానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సృష్టించుకున్న కంగనా రనౌత్‌ కొత్త సినిమా ‘ధాకడ్‌’ టీజర్‌ మంగళవారం విడుదలయ్యింది. ‘వై షుడ్‌ బాయ్స్‌ హ్యావ్‌ ఆల్‌ ది ఫన్‌’ అంటూ ఇందులో కంగన చేసిన పోరాటాలు ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ‘ఏజెంట్‌ అగ్ని’ అనే గూఢచారి పాత్రలో నటిస్తోందామె. ఏడు భిన్నరకాల లుక్స్‌లో కనిపించనుందని సమాచారం. విడుదల తేదీ మే 27గా ప్రకటించినప్పటికీ వారం ముందుగానే మే 20న థియేటర్లలోకి వస్తున్నట్టు టీజర్‌లో తెలిపారు. రజనీష్‌ రాజీ ఘయ్‌ దర్శకుడు. దీపక్‌ ముకుట్‌, సోహెల్‌ మల్‌కాయ్‌లు నిర్మాతలు. దివ్యా దత్తా, అర్జున్‌ రాంపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల్లో నటించే హీరోయిన్లు తక్కువగా ఉన్నారు. ఆ అవకాశం నాకు రావడం అదృష్టం. పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాన్ని ఒక కథానాయికతో తీయడానికి నిర్మాతలు ధైర్యం చేశారు. ఇది నాకు ఆనందాన్ని కలిగించింది’ అని కంగన తెలిపింది. తాజాగా ‘లాకప్‌’ రియాల్టీ షో విజయంతో జోరు మీదున్న కంగన  ‘తేజస్‌, ‘సీతా’, ‘మణికర్ణిక రిటర్న్స్‌’ చిత్రాల్లో నటిస్తుండటంతో పాటు ‘ఎమర్జెన్సీ’ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది.

* ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘అనేక్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. మే 13న ప్రేక్షకుల ముందుకు రావాలని ముందుగా భావించినప్పటికీ రెండు వారాలు ఆలస్యంగా మే 27న విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్‌, సిన్హా బెనారస్‌ మీడియా వర్క్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణంలో వస్తున్న రణ్‌వీర్‌సింగ్‌ ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ సినిమా విడుదలకు అనుకూలంగా ‘అనేక్‌’ చిత్ర నిర్మాతలు సిన్హా, భూషణ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని