malavika mohanan: నేను గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే...!

తన ఫొటోషూట్స్‌తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్‌. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్‌గా  కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి.

Updated : 30 Apr 2024 09:47 IST

న ఫొటోషూట్స్‌తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్‌. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్‌గా  కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. అలాంటి అందాల తారని ఓసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఊహించుకుంటే? తన కల కూడా అదే అంటోంది మాళవిక. ‘నాలాంటి ఓ అమ్మాయి గన్‌ పట్టి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో కదూ’ అంటోంది మాళవిక. తెలుగులో ప్రభాస్‌తో కలిసి ‘రాజా సాబ్‌’ సినిమాలో నటిస్తోందీమె. తమిళంలో విక్రమ్‌ సినిమా ‘తంగలాన్‌’లోనూ నటించింది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఈమె, సోమవారం అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా తన కలల పాత్రని బయటపెట్టింది. ‘‘గ్యాంగ్‌స్టర్‌గా నటించాలనుకుంటున్నా. నేను యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయడంలోనూ శిక్షణ పొందాను. భవిష్యత్తులో ఆ తరహా పాత్రల్ని చేయడానికి ప్రయత్నిస్తా. అలాగే ఓ సున్నితమైన ప్రేమకథా చిత్రం కూడా చేయాలనుంద’’ని చెప్పుకొచ్చింది మాళవిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని