రింకూ..విషు.. ఓ మెజీషియన్‌

ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఓ అమ్మాయికి పెద్దల అల్టిమేటం...ఆ అమ్మాయిని వివాహమాడాలని ఓ అబ్బాయికి ఇంట్లోవాళ్ల బలవంతం..

Published : 25 Nov 2021 03:34 IST

ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఓ అమ్మాయికి పెద్దల అల్టిమేటం...ఆ అమ్మాయిని వివాహమాడాలని ఓ అబ్బాయికి ఇంట్లోవాళ్ల బలవంతం.. ఇది ఇలా జరుగుతుండగా మధ్యలో ఓ కొత్త వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది ‘అతరంగీ రే’లో చూడాల్సిందే. అక్షయ్‌కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంటిక్‌ కామెడీగా ఆనంద్‌ ఎల్‌రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో రింకూగా సారా, విషుగా ధనుష్‌ పాత్రలు ఉండనున్నాయి. అక్షయ్‌కుమార్‌ పాత్రను చూపించారు కానీ... పరిచయం చేయలేదు. ఆయన ఇందులో సజత్‌ అనే ఓ మెజీషియన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం 24 డిసెంబరు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని