ఏఆర్‌ రెహమాన్‌కు ప్రత్యేక గౌరవం

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గానూ 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఫ్‌)లో ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించారు.

Published : 30 Nov 2021 02:43 IST

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గానూ 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఫ్‌)లో ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివారం సిఫ్‌ ప్రెసిడెంట్‌ మొహమ్మద్‌ హెఫ్జి చేతుల మీదుగా గౌరవ ట్రోఫీని అందుకున్నారు రెహమాన్‌. ఈ విషయాన్ని రెహమాన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలో ట్రోఫీ అందుకుంటూ దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆఫ్రికాలో అత్యంత పురాతన చలన చిత్రోత్సవం ‘సిఫ్‌’. ఈజిప్ట్‌లోని కైరో ఒపెరా హౌస్‌లో నవంబర్‌ 28న ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం.. డిసెంబర్‌ 5న ముగియనుంది. రెహమాన్‌ ఇటీవలే ‘99 సాంగ్స్‌’ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని