Kalki 2989 AD: ‘కల్కి’లో ప్రభాస్‌ను అలా చూస్తారు.. ట్రైలర్‌ రిలీజ్‌ ఎప్పుడో చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్ ఈవెంట్‍లో పాల్గొన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ విశేషాలను పంచుకున్నారు.

Published : 29 Dec 2023 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) ‘సలార్‌’ సూపర్ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్ ఈవెంట్‍లో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నారు.

‘కల్కి 2898 ఏడీ’లో ఫైటింగ్స్‌ ఉంటాయా?

నాగ్‌ అశ్విన్‌: ఉంటాయి. వాటిని కూడా ఎంజాయ్‌ చేస్తారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

ఈ సినిమా పేరు ‘కల్కి’ అని పెట్టడానికి కారణం?

నాగ్‌ అశ్విన్‌: అది చాలా శక్తిమంతమైన పేరు. కథకు సరిపోతుందని దాన్ని పెట్టాం. 

‘కల్కి 2898 ఏడీ’ ఎన్ని పార్టులుగా వస్తుంది? ప్రభాస్‌ ఎలా కనిపిస్తారు?

నాగ్‌ అశ్విన్‌: ఎన్ని భాగాలుంటుందని త్వరలోనే వెల్లడిస్తాం. ఇందులో కచ్చితంగా ఫ్యూచర్‌ ప్రభాస్‌ను చూస్తారు. పురాణాలను.. సైన్స్‌తో కలపడం చాలా కొత్తగా ఉంది. మన పురాణాల్లోనూ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో ఉంది. అవి ఎంతో పవర్‌ఫుల్‌. ఆ అస్త్రాలకు టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు.

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లాగా మీరు కూడా నాగ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా?

నాగ్‌ అశ్విన్‌: లేదు. ఈ ఒక్క సినిమా కాన్సెప్ట్‌ మాత్రమే ఇలా ఉంటుంది.

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లతో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నాగ్‌ అశ్విన్‌: వాళ్లందరూ లెజెండ్స్‌. సినిమాను ఎంతో అభిమానిస్తారు. వాళ్లతో సినిమా చేయడం గర్వంగా ఉంది.

‘కల్కి’ ట్రైలర్‌ ఎప్పుడొస్తుంది?

నాగ్‌ అశ్విన్‌: 93 రోజుల తర్వాత వస్తుంది.

‘కల్కి’ ఎంత వసూళ్లు చేస్తుందనుకుంటున్నారు?

నాగ్‌ అశ్విన్‌: హ్యూజ్‌.

ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులకు మీరిచ్చే సలహా?

నాగ్‌ అశ్విన్‌: ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండాలి. ప్రతి అంశాన్ని పరిశీలించడం నేర్చుకోవాలి.

టీజర్‌కు రెస్పాన్స్‌ ఎలా అనిపించింది?

నాగ్‌ అశ్విన్‌: సంతోషంగా అనిపించింది. ఇందులో వాడిన ఆయుధాలు బాగున్నాయని చెప్పారు. అలాగే వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ విషయానికొస్తే.. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామికాన్‌ వేదికగా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించింది. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని