Kareena Kapoor: ఆర్టీవో గారూ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్.. నెటిజన్ల నుంచి విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కరీనాకపూర్ ఇప్పుడు ఫ్యామిలీ టైమ్‌ని ఆద్యంతం...
కరీనా-సైఫ్‌ల డేట్.. నెటిజన్ల ట్రోలింగ్
ముంబయి: బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khna) , కరీనాకపూర్ (Kareena Kapoor).. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ జంట ముంబయి వీధుల్లో కాసేపు సరదాగా డ్రైవింగ్‌కు వెళ్లింది. అయితే, వీరిద్దరూ సీటు బెల్ట్ ధరించలేదు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు.. ‘‘సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్‌లు ఇస్తున్నారు?’’, ‘‘ఆర్టీవో గారూ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’’, ‘‘సామాన్యులకు జరిమానాలు విధించే అధికారులు.. మరి, ఈ జంటకు ఫైన్ వేయరా?’’ అంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’లో (Adipurush) సైఫ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ రాముడిగా కనిపించనున్న ఈ సినిమాలో సైఫ్ లంకేశుడిగా ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్