Mahesh Babu: అవి ఆయుర్వేదిక్ బీడీలు.. ‘గుంటూరు కారం’లో స్మోకింగ్‌పై మహేశ్
Guntur Kaaram: ఇటీవల విడుదలైన గుంటూరుకారం గురించి ఆ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హైదరాబాద్: మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా మహేశ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో డ్యాన్స్ మూమెంట్స్ ఉండాలని ముందు నుంచే తానూ, దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నామని చెప్పారు. అందుకు తగినట్లుగానే రమణ (Mahesh babu) పాత్రకు అనుగుణంగా పాటలను డిజైన్ చేసుకున్నట్లు చెప్పారు.
ఆ బీడీల్లో పొగాకు ఉండదు!
ఇక ఈ సినిమాలో మహేశ్ వరుసగా బీడీలు కాలుస్తూ కనిపించారు. దీనిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను స్మోకింగ్‌ను అస్సలు ప్రోత్సాహించను. సినిమాలో బీడీ కాల్చడం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చెబుతా. అది ఒక ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. మొదట నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయేది. ఆ నొప్పి భరిస్తూ షూటింగ్లో పాల్గొనడం నా వల్ల కావటం లేదని త్రివిక్రమ్‌కు చెప్పా. ఆ మరుసటి రోజు నుంచి ఆయుర్వేదిక్ బీడీలు తయారు చేసి సెట్వాళ్లు తీసుకొచ్చారు. అందులో ఎలాంటి టుబాకో ఉండదు. మింట్ ఫ్లేవర్‌లో ఉండటంతో సౌకర్యవంతంగా షూటింగ్ చేసేందుకు వీలైంది’’
ఫస్ట్‌లుక్‌లో వేసుకున్న రెడ్ షర్ట్ అవుట్ ఆఫ్ స్టాక్
‘‘ఈ మూవీలో రెడ్ షర్ట్ వేసుకున్న స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. ఆ తర్వాత పది రోజుల పాటు ఆన్లైన్ స్టోర్స్‌లో ఆ షర్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ చూపించిందని చాలా మంది నాతో చెప్పారు. అప్పటి నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాం. అలాగే డ్యాన్స్‌ల విషయంలోనూ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చేయాలనుకున్నాం. ‘పోకిరి’లో ‘దేవుడా దేవుడా’ సాంగ్‌లో నేను చూపించిన యాటిట్యూడ్ కావాలని త్రివిక్రమ్ అడిగారు. శేఖర్ మాస్టర్ కూడా అందుకు తగిన విధంగా స్టెప్స్ డిజైన్ చేయడంతో అదే యాటిట్యూడ్‌తో సాంగ్స్ తీయడం మొదలు పెట్టాం’’
‘‘కుర్చీ పాట’ డిసెంబరు 22న షూటింగ్ మొదలు పెట్టాం. చాలా టెన్షన్‌గా అనిపించింది. ఆ పాటను తెరపై చూసిన తర్వాత ‘నేనేనా’ అనిపించింది. ‘ఓ మై బేబీ’ పాటను కూడా కేరళలో తీద్దామని అనుకున్నాం. నాకు, శ్రీలీలకు నాలుగైదు డ్రెస్‌లను కూడా రెడీ చేశారు. మరుసటి రోజు షూటింగ్‌కు వెళ్దామని సిద్ధమవుతుండగా, చివరి నిమిషంలో వద్దనుకున్నాం. రమణ పాత్రను దృష్టిలో పెట్టుకుని రియల్‌టైమ్‌లో కాస్ట్యూమ్స్, పాటలను తీశాం. దీంతో సింగిల్ డ్రెస్‌లో పాట మొత్తం కనిపించినందుకు శ్రీలీల ఫీల్ అయింది. ఆ సాంగ్ కోసం తీసి పెట్టిన ఆరు డ్రెస్‌లను రీల్స్ కోసం వాడేసుకుంది’’ అని మహేశ్‌బాబు నవ్వుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్‌గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్‌కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్‌పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్‌హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్‌హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్‌లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్‌బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్