Mani Ratnam: అక్కడ జరిగే చర్చలు రోడ్‌ సైడ్‌ డిబేట్స్‌లా ఉంటాయి : మణిరత్నం

హీరోల అభిమానుల మధ్య ఆన్‌లైన్‌లో జరిగే మాటల యుద్ధాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు దర్శకుడు మణిరత్నం.

Updated : 20 Nov 2023 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియా వేదికగా అభిమానుల మధ్య జరిగే మాటల యుద్ధాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam). ‘‘సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరెవరో కామెంట్స్‌ చేస్తుంటారు. ఎదుటివ్యక్తులను దూషించడానికే వారు ఈ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అక్కడ జరిగే చర్చలు రోడ్‌ సైడ్‌ డిబేట్స్‌లా ఉంటాయి. అవసరమైన విషయాలపై ఏదైనా చర్చలు జరిగితే పర్వాలేదు కానీ.. నాకు విజయ్‌ ఇష్టం. నాకు అజిత్ ఇష్టం అంటూ వాదనలకు దిగడంలో ఎలాంటి అర్థం లేదు’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ట్విటర్‌ వేదికగా ఈ మధ్యకాలంలో తరచూ అభిమానుల మధ్య వార్‌ జరుగుతోంది. మా హీరో గొప్ప అని కొంతమంది అంటే.. లేదు మా హీరోనే గొప్ప అని ఇంకొంత మంది పోస్టులు పెడుతున్నారు. కొన్నిసార్లు మితిమీరి అసభ్యపదజాలంతోనూ దూషించుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే చాలామంది స్టార్‌హీరోలు స్పందించారు. ‘మేమంతా ఒక్కటే.. సినిమాల పరంగా మా మధ్య పోటీ ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి’ అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా సరే ఆన్‌లైన్‌లో మాత్రం అవి ఆగడం లేదు.

ఈవారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే..

‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రాలతో ఇటీవల విజయాన్ని అందుకున్నారు మణిరత్నం. ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. కమల్‌హాసన్‌ హీరోగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రలు పోషించనున్నారు. త్రిష కథానాయిక. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని