Telugu Movies: ఈవారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే..

నవంబరు ఆఖరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర చిన్న చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో చూసేయండి..

Updated : 20 Nov 2023 14:39 IST

మాస్‌ యాక్షన్‌ కథాంశంతో..

వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sree Leela) జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆదికేశవ’ (Adikeshava). ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వైష్ణవ్‌ ఇందులో రుద్ర అనే పాత్రలో కనిపిస్తారు. మనసులు దోచే చిత్రగా శ్రీలీల నటించింది. వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్‌ కనిపించనుంది’’ అని చిత్ర బృందం తెలిపింది.


పాటతోనే క్రేజ్‌ తెచ్చుకున్న మూవీ

శ్రీకాంత్‌ (Meka Srikanth) ప్రధాన పాత్రధారిగా.. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.


ఆరేళ్ల క్రితం సినిమా..

విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీనిని సిద్ధం చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


థ్రిల్‌ చేసే ‘పర్‌ఫ్యూమ్‌’ 

చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). జేడీ స్వామి దర్శకత్వం వహించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


మాధవే మధుసూదనా

తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana). బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు.


ఓటీటీ వేదికగా అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు

  • సోనీలివ్‌ 
  • చావర్‌ (మలయాళం): నవంబరు 24
  • నెట్‌ఫ్లిక్స్‌
  • స్టాంపెడ్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ (హాలీవుడ్‌): నవంబరు 20
  • స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 22
  • పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23

  • మై డెమన్‌ (కొరియన్‌): నవంబర్‌ 23
  • డాల్‌ బాయ్‌ (హాలీవుడ్‌): నవంబరు 24
  • గ్రాన్‌ టురిస్మో (తెలుగు డబ్బింగ్‌): నవంబరు 25
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ది విలేజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 24

  • బుక్‌ మై షో
  • ఒప్పైన్‌ హైమర్‌ (హాలీవుడ్‌): నవంబరు 22
  • యాపిల్‌ టీవీ ప్లస్‌
  • హన్నా వాడ్డింగ్‌హమ్‌ (హాలీవుడ్‌): నవంబరు 22
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని