mrunal thakur: నాకొచ్చే పాత్రలు నాకొస్తాయి

నటించిన ప్రతి భాషలోనూ అందం.. ఆకట్టుకునే అభినయంతో తనదైన ముద్ర వేస్తోంది మృణాల్‌ ఠాకూర్‌. ‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్‌ నాన్న’లో యష్నగా తెలుగువాళ్లకి దగ్గరైన ఆమె, ‘పూజా మేరీ జాన్‌’ హిందీ చిత్ర ప్రచారంలో ఉంది. అందులో భాగంగా తను పంచుకున్న కొన్ని కబుర్లు ఇవి.

Published : 01 Feb 2024 17:39 IST

నటించిన ప్రతి భాషలోనూ అందం.. ఆకట్టుకునే అభినయంతో తనదైన ముద్ర వేస్తోంది మృణాల్‌ ఠాకూర్‌. ‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్‌ నాన్న’లో యష్నగా తెలుగువాళ్లకి దగ్గరైన ఆమె, ‘పూజా మేరీ జాన్‌’ హిందీ చిత్ర ప్రచారంలో ఉంది. అందులో భాగంగా తను పంచుకున్న కొన్ని కబుర్లు ఇవి.

  • ‘హాయ్‌ నాన్న’ చిత్రంలో నేను పోషించిన యష్న పాత్ర నాకెంతో నేర్పింది. మనకు దక్కాలని రాసి పెట్టి ఉన్నది దక్కక మానదు.. ఒక్కోసారి ఆలస్యమైనా అది తప్పదు అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. నాకొచ్చే మంచి పాత్రలు, సినిమాలు కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వస్తాయని నా ప్రగాఢ విశ్వాసం.
  • ‘సీతారామం’లోని సీత, ‘హాయ్‌ నాన్న’లోని యష్న... ఈ రెండు పాత్రల గురించి నన్ను ఇప్పటికీ చాలామంది మెచ్చుకుంటున్నారు. కాలం గడిచినకొద్దీ వైన్‌ రుచి పెరుగుతుందంటారు. ఆ రెండు పాత్రలూ అలాంటివే. నాకెప్పటికీ మరపురానివిగా గుర్తుండిపోతాయి. ‘సీతారామం’లోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికీ కొంతమంది వీడియో క్లిప్స్‌ పంచుకుంటుంటే.. చాలా సంతోషంగా ఉంటుంది.
  • నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం అభిమానుల ప్రేమ, ప్రేక్షకుల ప్రోత్సాహమే. అందుకే నేను ఎంచుకునే ప్రతి పాత్రా.. ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. ఈ సినిమా ద్వారా వాళ్లని ఎలా ఆకట్టుకోగలను? అని ఆలోచిస్తుంటాను. ‘పూజా మేరీ జాన్‌’లో కూడా వాళ్లకు నచ్చేలా, నాకు సవాల్‌లాంటి ఓ పాత్రలోనే కనిపించనున్నా.
  • ‘ఫ్యామిలీ స్టార్‌’ నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తి వినోదాత్మక, వాణిజ్య చిత్రం. దీంతో తెలుగువాళ్లకి మరింత దగ్గరవుతా. దర్శకుడు పరశురామ్‌ రైటింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన బలం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు