Nani: మహేశ్‌ బాబుతో మల్టీస్టారర్‌.. నాని ఆన్సర్‌ ఏంటంటే?

హీరో నాని అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు.

Published : 05 Dec 2023 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో నాని (nani) ఒకరు. తన కొత్త సినిమా ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) ఈనెల 7న (Hi Nanna Release Date) విడుదల కానున్న సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా అభిమానులతో ముచ్చటించారాయన. ఈ క్రమంలోనే మహేశ్‌ బాబు (Mahesh Babu)తో కలిసి నటించే అవకాశం ఉందా? అని ఓ ఫ్యాన్‌ అడగ్గా నాని ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇంకా ఆయనకు ఎదురైన ప్రశ్నలేంటి?ఎలా స్పందించారంటే..?

* శౌర్యువ్‌ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?

నాని: ఈ సినిమాతో శౌర్యువ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అతడి ప్రతిభని మీరు మూడు రోజుల్లో చూస్తారు.

* ‘హాయ్‌ నాన్న’ సినిమా చూస్తుంటే బోర్‌ ఫీలవుతామా..?

నాని: ఒక్క సెకను కూడా అలా అనిపించదు. మూడోసారి చూస్తున్నా ఆ ఫీలింగ్ కలగదు.

* ఈ సినిమాలో శ్రుతి హాసన్‌తో మీ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి?

నాని: సీన్స్‌ కాదు సాంగ్‌.. అదిరిపోతుంది.

* తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ ఉండే అవకాశం ఉందా?

నాని: పెయిడ్‌ ప్రీమియర్స్‌ లేవు. హైదరాబాద్‌లోని ఎ.ఎం.బి. సినిమాస్‌లో మీడియా, పలువురు ప్రముఖులకు కొన్ని ప్రత్యేక షోలు ఉంటాయి. ఈ నెల 6 రాత్రిలోపు ఈ సినిమా ఉందా, ఊడిందా? అనేది మీకు తెలిసిపోతుంది. ఎప్పటికీ ఉండిపోతుంది అనేది నా ఫీలింగ్‌.

* సినిమా ప్రమోట్‌ చేసేందుకు ఆస్ట్రేలియా రావొచ్చు కదా అన్నా..

నాని: పాములు ఉంటాయట కదా అక్కడ!

* మీరు నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్‌’కు ప్రీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచన ఉందా? శ్యామ్‌, రోజీలతో మళ్లీ ప్రేమలో పడాలని ఉంది.

నాని: రోజీ అలియాస్‌ మైత్రీ (హీరోయిన్‌ సాయి పల్లవి పోషించిన పాత్ర)ని అడిగి చెబుతా.

* మీపై నెగెటివిటీ వచ్చిన సమయంలో ఎలా ఫీలవుతారు?

నాని: మనపై ప్రేమాభిమానాలు ఎక్కువయ్యే కొద్దీ నెగెటివిటీ కూడా తారసపడుతుంది. అది కావాలి.. ఇది వద్దు అంటే ఎలా?

ఓ ఫ్యాన్‌ కోరిక మేరకు పంచుకున్న ఫొటో..

* వర్ధమాన దర్శకుల్లో ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు?

నాని: వేణు (బలగం చిత్ర దర్శకుడు)

* గౌతమ్‌ తిన్ననూరి (జెర్సీ) దర్శకత్వంలో మరోసారి మీ సినిమా ఆశించొచ్చా?

నాని: 100 శాతం.

* అన్నా నేను బొగ్గు నేపథ్యంలో ఓ కథ రాశా. నీ డేట్స్‌ ఇవ్వవా సినిమా చేస్తా..

నాని: అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో చేయడం ఇక నా వల్ల కాదు. (నాని నటించిన ‘దసరా’ అదే నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే)

* మహేశ్‌బాబుతో మల్టీస్టారర్‌ చేసే ప్లాన్స్‌ ఉన్నాయా?

నాని: చేస్తే బాగుంటుంది. త్రివిక్రమ్‌ గారూ వింటున్నారా..?

* మీ సక్సెస్‌ మంత్ర ఏంటి? చెబితే నేనూ నా రంగంలో అప్లై చేసుకుంటా?

నాని: ‘మంత్ర’లాంటివి లేకపోవడమే నా మంత్ర.

* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కదా. ఫలితాలపై మీ అభిప్రాయం?

నాని: పదేళ్లు బ్లాక్‌బస్టర్‌ సినిమా చూశాం. థియేటర్‌లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుందాం.

* ఇటీవల మీ కంటికి గాయమైంది కదా. ఇప్పుడెలా ఉంది?

నాని: తగ్గింది. ఇప్పుడు బాగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని