Rathika rose: టాప్‌-5లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి: రతిక

Rathika rose Interview: బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రతికా రోజ్‌ అనేక ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Published : 28 Nov 2023 10:03 IST

హైదరాబాద్‌: మొదటిసారితో పోలిస్తే, రెండోసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లినప్పుడు తన ఆటతీరు పూర్తిగా డౌన్‌ అయిపోయిందని, ఎక్కువ ఒత్తిడి ఉన్న కారణంగా ఆడలేకపోయిన మాట వాస్తవమేనని రతిక (Rathika rose) చెప్పుకొచ్చింది. సీజన్‌-7లో రెండోసారి ఎలిమినేట్‌ అయిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు!

‘‘గేమ్స్‌లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. నేనూ ప్రయత్నించా.  యాక్టివిటీల పరంగా చిన్నప్పటి నుంచి వీక్‌. రెండోసారి అవకాశం వస్తే, సరిగా వినియోగించుకోలేకపోయా. ఆ విషయాన్ని అంగీకరిస్తా. మొదటిసారి ఎలిమినేట్‌ అయినప్పుడు శివాజీ, ప్రశాంత్‌లను కనీసం చూడకుండా బయటకు రావడానికి కారణం ఉంది. నేను ఎలిమినేట్‌ అయ్యానన్న ప్రకటన రాగానే నా మైండ్‌ బ్లాంక్ అయిపోయింది. ఏ మాట్లాడాలో కూడా కొద్దిసేపు తెలియలేదు.  బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి, వాళ్లకు సారీచెప్పా. రతిక ఫ్లిప్‌స్టార్‌, కన్నింగ్‌స్టార్‌, ల్యాగ్‌స్టార్‌ అనే పేర్లను పొగొట్టుకున్నానని అనుకుంటున్నా. వారమంతా జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని అందులో సరైన కారణాలు వెతికి నామినేట్‌ చేయాలి. అంతేకానీ, చిన్న చిన్న కారణాలతో నామినేట్‌ చేయడం నా (Rathika rose) వల్ల కాదు. అందుకే ఒక వారం నామినేషన్స్‌ నాతో మొదలు పెట్టమంటే కాస్త సమయం అడిగా’’

అతడి మాటలు బాధించాయి!

‘‘బయటకు వచ్చి వెళ్లాక రెండోవారంలో జరిగిన విషయాలను యావర్‌తో పంచుకుంటే, వాటినే ఉపయోగించి అతడు అమర్‌ను నామినేట్‌ చేశాడు. నేనేమీ కావాలని చెప్పలేదు. ఏదో మాటల సందర్భంలో చెప్పాను. ఇక బొమ్మ పట్టుకునే టాస్క్‌లో అమర్‌తో అనవసరంగా గొడవ ఎందుకని బతిమిలాడా. ఇక అమర్‌ కెప్టెన్సీ టాస్క్‌ ఆడుతున్నప్పుడు అతడికి సపోర్ట్‌ చేయకపోవడానికి కారణం ఉంది. ఈ మధ్యలో వ్యక్తిగతంగా నన్ను (Rathika rose) రెండు, మూడు మాటలు అన్నాడు. వాటికి చాలా బాధ అనిపించింది. అందుకే ప్రియాంకను సపోర్ట్‌ చేశా’’

నా గురించి వాళ్లకు ఎందుకు?

‘‘మొదటిసారి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన తర్వాత నాకూ అభిమానులు ఉన్నారని అర్థమైంది. మళ్లీ రీఎంట్రీ అప్పుడు నన్ను చాలా మంది ప్రోత్సహించారు. ఆ బాధ్యత నాపై పడిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. గతంలో చేసిన తప్పులను సరిచేసుకోవడానికి మళ్లీ హౌస్‌లోకి వెళ్లా. నెగెటివ్‌ టాక్‌ పోవాలని కోరుకున్నా. వైల్డ్‌ కార్డు ద్వారా హౌస్‌లోకి వచ్చిన వాళ్లు బయట ఏం జరిగిందో ‘బిగ్‌బాస్‌ బజ్‌’ చూసి అక్కడి వాళ్లకు చెప్పారు. దీంతో సందర్భం వచ్చినప్పుడు వాళ్లు ఆ విషయాలను తీసుకొచ్చి నేను (Rathika rose) బాధపడేలా కామెంట్స్‌ చేసేవారు. ఆ మాటలకు పైకి నవ్వుతూనే లోపల బాధపడేదానిని. ఇక వైల్డ్‌ కార్డులో వచ్చిన వాళ్లకు నా గురించి ఎందుకు? అందుకే రెండోసారి వెళ్లినప్పుడు మరీ డౌన్‌ అయిపోయానేమో. మొదటిసారి వెళ్లినప్పుడు నా వాయిస్‌ కాస్త గట్టిగా వినిపించేదాన్ని. చాలా విషయాలను ప్రశ్నించేదాన్ని. అది జరగలేదు. యావర్‌తో ట్రాక్‌ నడపాలని నాకేమీ లేదు. రోజూ కావాలని వెంటపడి మాట్లాడలేం కదా’’

టాప్‌-5లో ఉండే అర్హత నాకు లేదు!

‘‘నేను అందరితోనూ బాగున్నా. అటు SPY(శివాజీ, ప్రశాంత్‌, యావర్‌), ఇటు SPA (శోభ, ప్రియాంక, అమర్‌) బ్యాచ్‌తో కలిసి లేను. ప్రశాంత్‌ విషయంలో ఇప్పటికీ నా తప్పును అంగీకరిస్తా.  ప్రతిసారీ వచ్చే వారం బాగా ఆడతానని చెప్పడం సరికాదేమో. నాకు ఓట్లు వేసి సపోర్ట్‌ చేసి వారికి సారీ అని చిన్న మాటతో చెప్పి మభ్యపెట్టలేను. ఒక విషయమైతే చెప్పగలను. ‘బిగ్‌బాస్‌’లో టాప్‌-5లో ఉండే అర్హత నాకు (Rathika rose) లేదు. అందుకు నన్ను క్షమించండి. టాప్‌-3లో ఒకరిగా శివాజీ అన్నను చూడాలనుకుంటున్నా’’

ఈ సందర్భంగా పూలకుండీ, చెత్తకుండీలలో ఎవరెవరిని వేస్తావు అనగా, శివాజీ, ప్రశాంత్‌, అర్జున్‌ ఫొటోలను పూలకుండీలో ఉంచిన రతిక.. యావర్‌, గౌతమ్‌, అమర్‌, శోభ, ప్రియాంకల ఫొటోలను చెత్తకుండీలో వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు