కంగనపై తాప్సీ ప్రశంసలు.. స్పందించిన ‘తలైవి’

బాలీవుడ్‌ హీరోయిన్లు కంగన రనౌత్‌, తాప్సీ పన్ను మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. అయితే..

Updated : 10 Apr 2021 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్లు కంగన రనౌత్‌, తాప్సీ పన్ను మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరింగింది. ‘తప్పడ్‌’ సినిమాలో తన నటనకు గానూ తాప్సీ ఉత్తమ నటి విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. అవార్డు అందుకున్న సందర్భంగా వేదికపై తాప్సీ మాట్లాడింది. ఈక్రమంలోనే తనతో పాటు నామినేట్‌ అయిన కంగన, దీపిక పదుకొణె, జాన్వీ కపూర్‌, విద్యాబాలన్‌ను ఆమె ప్రశంసించింది. అద్భుతమైన నటనతో తనకు ఒక బెంచ్‌మార్కును సెట్‌ చేసినందుకు కంగనకు కృతజ్ఞతలు చెప్పింది. దీనికి సంబంధించి వీడియోను తాప్సీ సోషల్‌ మీడియాలో పంచుకుంది. కాగా.. తాప్సీ వీడియోపై కంగన కూడా స్పందించింది. తాప్సీకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఈ అవార్డు అందుకోవడానికి నీకంటే అర్హులు మరెవరూ లేరంటూ తాప్సీపై ప్రశంసలు కురిపించింది.

ఇదిలా ఉండగా తాప్సీ ప్రస్తుతం స్పోర్ట్స్‌ డ్రామా ‘శెభాష్‌ మిథూ’లో నటిస్తోంది. భారత మహిళా క్రికెట్‌ సారథి మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మరోవైపు ఆమె నటించిన ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కంగన సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తలైవి’లో ఆమె ప్రధానపాత్ర పోషించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని