RRR: త్వరలో మీ ముందుకు వస్తాం.. అన్నింటికీ సమాధానమిస్తాం: రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్...
‘జనని’ పాట విడుదల కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా నవంబర్ 26న ‘జనని’ అనే పాట విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను గురువారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు. ‘‘జనని’ పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఓ సోల్. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. డిసెంబర్ మొదటి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేశాం. వచ్చే నెలలో వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. నటీనటులు, మెయిన్ టెక్నిషియన్స్.. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెబుతాం’ అని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌చరణ్-తారక్ మొదటిసారి ఈ సినిమా కోసం స్క్రీన్ పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ.. కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘జనని’ పాటపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్‌బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్‌లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్‌ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్‌కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్‌కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్‌కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డికి చుక్కెదురు