Vijay antony: ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్‌ జానర్‌లో ‘లవ్‌ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్‌ వైద్యనాథన్‌ తెరకెక్కించారు.

Updated : 10 Apr 2024 12:10 IST

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్‌ జానర్‌లో ‘లవ్‌ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్‌ వైద్యనాథన్‌ తెరకెక్కించారు.  ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు విజయ్‌ ఆంటోని.

  • ‘‘వ్యక్తిగతంగా నేనెప్పుడూ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే జీవిస్తుంటా. ఎందుకంటే మనం ఒకటి కోరుకున్నప్పుడు ఇంకొకటి దక్కితే నిరాశ పడాల్సి వస్తుంది. మనకు ఏది కావాలో.. ఏది ఇవ్వాలో విశ్వం చూసుకుంటుంది. ఈ చిత్ర విషయంలోనూ నేను ఇలాగే ఆలోచించా. ఈ కథ విన్నప్పుడు సినిమా సాధించబోయే విజయంపై నమ్మకం కలిగింది’’.
  •  ‘‘దర్శకుడు తన జీవితంలో చూసిన అనుభవాలతో ఈ కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ కామెడీని చూస్తారు. ఈ సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు’’.
  • ‘‘నాకు మెమొరీ పవర్‌ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే నేరుగా తెలుగులోనే సినిమాలు చేసేవాణ్ని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. ప్రస్తుతం మా ప్రొడక్షన్‌లో మూడు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. ఇక ‘బిచ్చగాడు 3’ 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని