Mahesh - Rajamouli: మహేశ్‌బాబు - రాజమౌళి సినిమా అప్‌డేట్‌ చెప్పిన విజయేంద్రప్రసాద్‌

మహేశ్‌బాబు 29వ చిత్రం అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అది పట్టాలెక్కనుంది.

Updated : 25 Jun 2023 11:05 IST

‘గుంటూరు కారం’ చిత్రీకరణ కోసం మళ్లీ రంగంలోకి దిగారు మహేశ్‌బాబు. శనివారం హైదరాబాద్‌ శివార్లలో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. మహేశ్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌ తొలి వారం వరకూ చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. మహేశ్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. శ్రీలీల కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన ఈ కలయికలో ప్రాజెక్ట్‌ కుదిరినప్పటి నుంచి పలు అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు కొన్ని నెలల విరామం తర్వాత సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కావడంతో మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

29 కబుర్లు...: మహేశ్‌కి ‘గుంటూరు కారం’ 28వ సినిమా కాగా... ఆయన  29వ చిత్రం అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అది పట్టాలెక్కనుంది. ఆ ప్రాజెక్ట్‌ గురించి రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల బాలీవుడ్‌ మీడియాతో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. జులైలోపు స్క్రిప్ట్‌ పూర్తి చేసి, రాజమౌళికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా మరో చిత్రాన్నీ తెరకెక్కించేందుకు ఆస్కారం ఉందని, పతాక సన్నివేశాల్ని అలా మలిచినట్టు ఆయన తెలిపారు. సాహసాలతో కూడిన ఓ యాక్షన్‌ డ్రామాగా ఆ సినిమా రూపొందనుంది.


మరో కథానాయిక ఎవరు?

సినిమాలో కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల పేర్లని ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈమధ్యే పూజాహెగ్డే తప్పుకుంది. మరి ఆ స్థానంలో మరొక కథానాయిక ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాన కథానాయికగా శ్రీలీల నటిస్తుండగా, మరో పాత్ర విషయంలో మీనాక్షి చౌదరి దాదాపు ఖాయం అయినట్టని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు