Updated : 17/03/2021 12:05 IST

అమెరికాలో కాల్పులు.. 8మంది మృతి

అట్లాంటా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అట్లాంటా ప్రాంతంలోని వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 8 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.

అట్లాంటా పోలీసు చీఫ్‌ ర్యాంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటాలోని బకెడ్‌, చెరోకీకౌంటీ ప్రాంతాల్లోని మూడు వేర్వేరు మసాజ్‌ పార్లర్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు మహిళలే కాగా.. వారు ఆసియాకు చెందిన వారు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి రాబర్ట్‌ ఆరోన్‌ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మసాజ్‌ పార్లర్లనే లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆయా ప్రాంతాల్లోని మిగతా కేంద్రాల వద్ద పోలీసులు భద్రత పెంచారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని