Ravi Kishan : దానిశ్‌ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్‌

భాజపా (BJP) ఎంపీ రమేశ్‌ బిధూడీ (Ramesh Bidhuri) బీఎస్పీ (Bsp) ఎంపీ దానిశ్‌ అలీపై (Danish Ali) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అలీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాజపా ఎంపీ, నటుడు రవికిషన్‌ (Ravi Kishan) లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

Published : 24 Sep 2023 16:22 IST

దిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్‌-3 విజయంపై చర్చ సందర్భంగా భాజపా  (BJP) ఎంపీ రమేశ్‌ బిధూడీ (Ramesh Bidhuri) బీఎస్పీ (Bsp) ఎంపీ దానిశ్‌ అలీపై (Danish Ali) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. రమేశ్‌ బిధూడీ వ్యాఖ్యలను పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఖండించారు. తాజాగా దానిశ్‌ అలీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాజపా ఎంపీ, నటుడు రవికిషన్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనుచితంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు. ‘2022లో డిసెంబరు 9న నేను జనాభా నియంత్రణపై ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాను. ఆ సందర్భంలో కున్వర్‌ దానిశ్‌ అలీ అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు. ఆ విషయాన్ని పరిశీలించి సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని’ రవికిషన్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు

తన సహచర ఎంపీ రమేశ్‌ బిధూడీ మాట్లాడే సమయంలో దానిశ్‌ అదే పనిగా అంతరాయం కల్గించారని, వాడీవేడీ వాదనలు జరుగుతున్న సమయంలో బిధూడీ సంయమనం కోల్పోయినందునే ఆయన నోటి నుంచి కొన్ని అభ్యంతరకర పదాలు వెలువడ్డాయని రవికిషన్‌ లేఖలో వెల్లడించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఎంపీ మరో ఎంపీపై అలాంటి పదాలను వినియోగించడానికి దారి తీసిన పరిస్థితులను స్పీకర్‌ పరిశీలించాలని కోరారు. 

ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకే బిధూడీ వివాదాస్పద పదాలను వినియోగించారని భాజపా ఐటీ సెల్‌ హెడ్ అమిత్‌ మాలవీయ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధానిని తీవ్రంగా దూషించడంతోనే బిధూడీ అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. లోక్‌సభలో చంద్రయాన్‌-3పై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ దానిశ్‌ అలీపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. సొంత పార్టీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం విచారం వ్యక్తం చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలంటూ బిధూడీకి భాజపా అధిష్ఠానం సైతం షోకాజ్‌ నోటీసులు పంపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని