Chandrababu: జనసేనతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు!

ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు తెదేపా, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు.

Published : 30 Jan 2024 13:53 IST

అమరావతి: ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు తెదేపా, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సమావేశమై చర్చించారు. అతి త్వరలోనే వారిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.

రానున్న 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. సీట్ల సర్దుబాటు కసరత్తు కోసం ‘రా.. కదలి రా’ సభలకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ సభలు పూర్తికాగా.. వచ్చే నెల 4 నుంచి మిగిలిన చోట్ల నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని